Metabolism: మన  శరీరం  లో మెట‌బాలిజం  ఎక్కువగా ఉండటం వలన ఏమి జరుగుతుందో తెలుసుకోండి !!(పార్ట్ -1)

Share

Metabolism:మ‌న శ‌రీరంలో ఖ‌ర్చ‌య్యే క్యాల‌రీల రేటునే మెట‌బాలిజం అంటారు. అంటే.. మెట‌బాలిజం ఎంత ఎక్కువ ఉంటే క్యాల‌రీలు అంత త్వ‌ర‌గా కరిగిపోతాయి. కాబట్టి  ప్ర‌తి ఒక్క‌రు ఆరోగ్య‌క‌ర‌మైన మెట‌బాలిజం క‌లిగి ఉండటం అవసరం. అది ఏ మాత్రం  తక్కువగా ఉన్న  అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల కు దారి తీస్తుంది. ఇంకా చెప్పాలంటే  మెట‌బాలిజం త‌గ్గితే,క్యాల‌రీలు త్వ‌ర‌గా ఖ‌ర్చుకావు దాని  ఫ‌లితంగా శ‌రీరంలో కొవ్వు  పెరిగి  అధిక బ‌రువు బారిన పడతారు. అలాగే డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు కూడా వ‌స్తాయి. క‌నుక మ‌న శ‌రీర మెట‌బాలిజం స‌రిగ్గా ఉండేలా జాగ్రత్త పడాలి. అందుకు గాను మనం కొన్ని  ఆహారాల‌ను నిత్యం  తీసుకోవాలి అవేంటో తెలుసుకుందాం.


ఆహారం లో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకుని తిన‌డం వ‌ల్ల మన శ‌రీర మెట‌బాలిజం రేటు 15 నుంచి 30 శాతం వ‌ర‌కు పెంచుకోవచ్చని  సైంటిస్టులు తెలియచేస్తున్నారు. క‌నుక ప్రోటీన్లు ఎక్కువగా  ఉండే చికెన్‌,కోడిగుడ్లు, మ‌ట‌న్, ప‌ప్పులు  ఎక్కువగా తీసుకోవటం వలన మెట‌బాలిజం  పెరిగి క్యాల‌రీలు త్వ‌ర‌గా ఖ‌ర్చ‌యి అధిక బ‌రువు తేలికగా  త‌గ్గుతారు.

ఇక నీరు కూడా తగినన్ని తాగుతూ ఉండాలి. ఏసీ  రూమ్ లో  పనిచేస్తున్న కూడా .. గంటకోసారి అర గ్లాసు నీటిని తాగుతూ ఉండాలి. నీటిని ఎక్కువగా  తాగ‌డం వ‌ల్ల కూడా శ‌రీర మెట‌బాలిజం వృద్ధి చెందుతుంది. 0.5 లీట‌ర్ల నీటిని తీసుకుంటే  మ‌న శ‌రీర మెట‌బాలిజం 10 నుంచి 30 శాతం వ‌ర‌కు ఇంప్రూవ్ అవుతుంది.


జిమ్‌లో చేసే  వ్యాయామం తో మ‌జిల్స్‌ను పెంచుకున్నా మ‌న శ‌రీర మెట‌బాలిజం రేటు వృద్ధి చెందుతుంది.
గంట‌ల కొద్దీమారకుండా ఒకే పొజిష‌న్‌లో కూర్చుంటే మ‌న శ‌రీర మెట‌బాలిజం తగ్గిపోతుంది. క‌నుక మ‌ధ్య మ‌ధ్య‌లో లేచి అటు ఇటూ నడుస్తూ ఉండాలి.


Share

Related posts

అప్పడం అంటే ఇష్టమా? అయితే ఇది తెలుసుకోండి!!

Kumar

Lock Down: మే 2 నుంచి లాక్ డౌన్‌.. ఈ విష‌యం చెప్తే మీ సంగ‌తి అంతే…

sridhar

విట‌మిన్ C ఎక్కువ‌గా ఉండే టాప్ 10 ఆహారాలు ఇవే..!

Srikanth A