Metabolism: మధ్యాహ్నం భోజనం చేసి వాకింగ్ చేయడం వల్ల 174 క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయని సైంటిస్టులు తెలియచేస్తున్నారు.కాబట్టి భోజనం చేశాక కొంత సేపు వాకింగ్ చేస్తే మెటబాలిజం వృద్ధి చెందుతుంది. అధికంగా ఉన్న బరువు కూడా తగ్గుతారు.ప్రతి రోజు తాగే కాఫీ, టీ లను మానేసి గ్రీన్ టీ లేదా ఊలాంగ్ టీ లను తాగటం వలన మన శరీర మెటబాలిజం 4 నుంచి 5 శాతం వరకు పెరిగి త్వరగా బరువు తగ్గుతారు.
కారం,మసాలాలు, లను ఎక్కువగా తిన్న మెటబాలిజం పెరిగి క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. ముఖ్యంగా దాల్చిన చెక్క, లవంగాలు లేదా మిరియాలు, మిర్చి వంటివి తింటే మెటబాలిజం బాగా పెరుగుతుంది.
ప్రతి రోజు సరిపడినంత నిద్రపోవాలి. అలా చేయడం వలన మన శరీర మెటబాలిజంబాగుంటుంది. బరువు అదుపులో ఉంటుంది.
వంట కోసం వాడే నూనెల్లో ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనెలను వాడడం వల్ల కూడా మన శరీర మెటబాలిజం పెరిగి అధిక బరువు తగ్గుతారు.
మనం తీసుకునే ఆహారం శక్తిగా మారి ఖర్చయ్యే విధానమే మెటబాలిజం. ఇది పెరగడం,తగ్గడం రెండు ఉంటాయి. మెటబాలిజం తగ్గితే శక్తి కొవ్వుగా మారుతుంది. కాబట్టి మెటబాలిజంను నీరసించి పోనివ్వకుండా పరుగులు పెట్టించాలంటే డార్క్ అవకాడో, చాక్లెట్, వాల్నట్స్,ఆలివ్ ఆయిల్, పీనట్ బటర్, ఫ్లాక్స్ సీడ్, చేపలు, సోయాబీన్స్ వంటివి తీసుకుంటూ ఉండాలి.
రోజుకు మూడు సార్ల పద్ధతిలో కాకుండా ప్రతి మూడు గంటలకు కొంచెం కొంచెం గా ఆహారం తీసుకోవాలి. ఇలా అలవాటు చేసుకుంటే మాత్రం గంటలపాటు కొవ్వు కరుగుతూ ఉంటుంది.
పైన చెప్పిన విధంగా నియమాలనుఅనుసరించడం వలన మన శరీర మెటబాలిజాన్ని పెంచుకుని బరువు అదుపులోపెట్టుకోవచ్చు . గుండె జబ్బులు,డయాబెటిస్, రాకుండా ఉంటాయి.