మన శారీరం లో ఎంతగా మెటబాలిజం పెరిగితే అంతగా క్యాలరీలను ఖర్చుచేస్తుంది…మనం తినే ఆహారం త్వరగా జీర్ణమై ఆ తరువాత వచ్చే శక్తి క్యాలరీ ల రూపంలో త్వరగా ఖర్చవుతుంది. దీనిద్వారా శరీరం లో ఉండే కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. శరీరం లో మెటబాలిజం పెరగాలంటేప్రతిరోజూ క్రమం తప్పకుండ వ్యాయామం చేయడంతోపాటు కింద తెలిపిన ఆహారాలను తీసుకోవాలి. దీంతో అధిక బరువు తగ్గేందుకు అవకాశాలు ఎక్కువగాఉంటాయి. మరి ఆ ఆహారాలుతెలుసుకుందాం.
గోరు వెచ్చని నీటిని ప్రతి రోజు తాగడం వల్ల కూడా శరీర మెటబాలిజం పెరుగుతుంది. రోజూమాములు నీటి కి బదులుగా గోరు వెచ్చని నీటి ని తాగితే నెలకు 1 నుంచి 2 కిలో ల వరకు బరువు తగ్గవచ్చని ఆయుర్వేదంలో తెలియచేయబడింది.
ఆహారం లోప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. ఎందుకంటే ప్రోటీన్ల ను జీర్ణం చేయడం కోసం శరీరం ఎక్కువగా క్యాలరీలను ఖర్చు చేయవలిసి ఉంటుంది. అలాగే ప్రోటీన్ల వల్ల ఎక్కువ సేపు ఆకలి లేకుండా ఉంటుంది. దీంతో ఆహారం తినేటప్పుడు తక్కువగా తీసుకుంటారు. ఫలితంగా బరువు తగ్గేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి
ప్రతి రోజు 2 లేదా 3 కప్పు ల కాఫీ తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుందని సైంటిస్టుల అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. కాఫీ తాగడం వల్ల మెబటాలిజం పెరిగి క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా అధిక బరువు తగ్గుముఖం పడుతుంది. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పు ధాన్యాల ను ఆహారంలో తీసుకోవడం వల్ల కూడా మెటబాలిజంను పెంచుకోవచ్చు.
యాపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గించడంలోనే కాక మెటబాలిజం పెరిగేందుకు కూడా సహాయ పడుతుంది. ప్రతి రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ నీటి లో రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలుపుకుని తాగితే మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు త్వరగా ఖర్చయిబరువు తగ్గి సన్నబడతారు.