హెల్త్

srimukhi: మీరు తినే డైట్ లో ఈ ఆహారపదార్ధాలు ఉన్నాయో లేదో సరిచేసుకోండి..!

Share

srimukhi: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ మధ్య కాలంలో చాలా మంది రకరకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు. తినే తిండి విషయంలో అసలు జాగ్రత్తలు వహించడం లేదు. వయసుతో సంబంధం లేకుండా ఏదో ఓక అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఎలాంటి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటామో కూడా తెలియని అయోమయంలో ఉంటున్నారు.అందుకే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు ఏయే ఆహారాలను రోజు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి బ్రతకడానికి ఆహారం ఎంత ముఖ్యమో అలాగే శరీరం సక్రమంగా పనిచేయాలన్నా గాని వ్యాయామం కూడా అంతే అవసరం అని ఆరోగ్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు.వయసు పెరిగే కొద్దీ శరీరంలో బలహీనత మొదలవుతుంది. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ ఉండాలి.మనం తినే ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.మరి రోజువారీ ఆహారంలో ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు:


తినే ఆహారంలో పెరుగును భాగంగా చేసుకోవాలి.ఎందుకంటే పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. పెరుగు తినడం వలన ఎముకలు బలంగా మారతాయి. అంతేకాకుండా పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది.వాటితో పాటుగా జింక్, విటమిన్ బి, ప్రోబయోటిక్స్, విటమిన్ డి వంటి ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి. అందుకే క్రమం తప్పకుండా పెరుగును మీ ఆహారంలో భాగంగా చేసుకోండి.

కోడి గుడ్లు:కోడి గుడ్లు తినడం వలన శరీరానికి కావలిసిన ప్రోటీన్లు సమపాళ్ళలో అందుతాయి.వయసు పెరిగే కొద్దీ ప్రొటీన్ అవసరం శరీరానికి అవసరం అవుతుంది.గుడ్లు తినడం వలన శరీరానికి శక్తి అందుతుంది.అలాగే ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో కోడి గుడ్లు ఎంతగానో సహాయపడతాయి.

చేపలు :చేపలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది గుండె సంబంధిత సమస్యల నుంచి కాపాడటంతో పాటుగా కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది.

ఫైబర్:తినే ఆహారంలో ఎక్కువగా ఫైబర్ ఉండేలా చూసుకోవాలి.అలాగే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. తినే ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. మీరు ఆహారంలో అనేక రకాల కూరగాయలు, పండ్లు, పప్పులను చేర్చుకోవచ్చు.


Share

Related posts

Intermittent fasting: ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ తో బరువు తగ్గడం తో పాటు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు పొందవచ్చో తెలుసా..?

Kumar

Pain Killer: నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం కోసం ఇవి ట్రై చేశారా..!?

bharani jella

Chocolate: ఈ చాక్లెట్ ఇలా తింటే హ్యాపీ మూడ్ వస్తుందంటా..!!

bharani jella