Butter 1.జాడీలో నుంచి ఊరగాయను బయటకు తీయాలనుకున్నప్పుడు గరిట వేడిచేసి దానితో తీస్తే పచ్చడి పాడవకుండా ఎప్పుడు తాజాగా ఉంటుంది.
2.కూరలు వండే ముందు నూనె వేడెక్కగానే అందులో పసుపు వేయడం వలన కూరలు వాటి సహజ రంగు తోనే ఉంటాయి.
3.ఒకో సారి ఫ్లాస్కులని ఎంత బాగా సుబ్రం చేసినా దాని దుర్వాసన పోదు అలాంటప్పుడు మజ్జిగతో కడిగితే వాసనా పోతుంది.
4.కూరల్లో కానీ పులుసులో కానీ ఉప్పు కారం ఎక్కువయితే రెండు చెంచాల సెనగపిండిని వేయించి అందులో కలిపితే బాగుంటుంది.
5.పాలలో మీగడ ఎక్కువగా కట్టాలి అంటే కాచడానికి ముందు పాలతో ఉన్న గిన్నెను చల్లటి నీటిలో కాసేపు ఉంచండి.
6.గుడ్లను ఉడక పెట్టె నీళ్ళల్లో రెండు చెంచాల వినెగర్ వేస్తె అవి పగిలిపోకుండా ఉడుకుతాయి.
7.పిండి వంటలు చేసేటప్పుడు బాణలిలో నూనె పొంగుతూ ఉంటుంది అలా జరగకుండా ఉండాలి అంటే మరుగుతున్న నూనెలో తమలపాకు వేసి … అది రంగు మారిన తర్వాత తీస్తే నూనె పొంగదు .
8.ఇంట్లో పచ్చి కొబ్బరి చిప్పలు ఉన్నప్పుడు కొబ్బరి చిప్పకు లోపల కొద్దిగా నిమ్మ రసం రాసి ఉంచితే వారం రోజులు గడిచిన కూడా అవి తాజాగానే ఉంటాయి.
9.టమాటాలు వండే ముందు పదినిమిషాల పాటు వేడినీటిలో నానపెడితే వంటలు చాల రుచిగా ఉంటాయి.
10ఆపిల్ పండ్ల పక్కనే, అరటి పండ్లని కూడా ఉంచితే, అవి త్వరగా పండిపోతాయి.
11.పచ్చిమిర్చిని కట్ చేసిన తర్వాత పంచదార కలిపిన చల్లటి నీళ్ళతో చేతుల్ని శుభ్రం చేసుకుంటే చేతులకు మంట ఉండదు.
12.బంగాల దుంప వేపుడు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు , ముక్కల్ని ఉప్పు నీళ్ళల్లో అరగంట పాటు నానబెట్టి ఆ తర్వాత వేయిస్తే ముక్కలు రుచిగా ఉంటాయి.