వర్ష కాలం లో వచ్చే అనేకరకాలైన జబ్బులనుండి మనలని మనము కాపాడుకోవాలి . దానిలో భాగం గా ఈ సీజన్ లో కంపల్సరీ గా తినాల్సిన కూరగాయలు కొన్నున్నాయి.
అవి ఈ సీజన్ లోనే వచ్చే వ్యాధుల నించి మనల్ని రక్షిస్తాయి. అలాగే తినకూడనివి కొన్నున్నాయి. అందులో ముఖ్యమైనవి ఆకు కూరలు. ఈ సీజన్ లో ఆకు కూరల మీద బాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఎంత జాగ్రత్త గా ఉన్నా కొద్దిగానైనా అది మన పొట్టలోకి చేరితే ఆరోగ్యం దెబ్బ తింటుంది. సీజనల్ కూరగాయలు ఫ్రెష్ గా ఉండడమే కాకుండా అనేకమైన పోషక విలువలతో కూడి ఉంటాయి. అవి మన ఇమ్యూనిటీ ని పెంచి ఇంఫెక్షన్స్ ని దరి చేరకుండా చూస్తాయి.
ఈ సీజన్ లో తిని తీరాల్సిన కూరగాయల లిస్ట్ లో సొర కాయ మొదటే ఉంటుంది, ఇందులో ఉన్న ఫైబర్ జీర్ణకోశాన్ని శుభ్రం గా ఉంచుతుంది. అరుగుదలని పెంచుతుంది. ఇందులో కాలరీలు తక్కువ. దానితో పొట్ట నిండుగా ఉంటుంది కానీ, హెవీ గా ఉండదు.బీరకాయలో కెరోటిన్, అమైనో ఆమ్లం, ప్రోటీన్ మరియు సిస్టీన్ ఉంటాయి. దీనిలోని ఫ్లేవనాయిడ్ కంటెంట్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జీర్ణక్రియకు ఇది చాలా సహాయపడుతుంది.
కాకర కాయ అందరికీ నచ్చదు. కొంచేం చేదుగా ఉంటుంది కాబట్టి పిల్లలు అసలు తినరు. కానీ, ఈ సీజన్ లో ఆ చేదే ఒంటికి చాలా మేలు చేస్తుంది.పిల్లలకి కొత్త కొత్త విషయాలు చెప్తూ అయినా సరే ఈ కూర తినిపించండి.ఆనప కాయ నీ సొర కాయ నీ కలిపి వాడేస్తూ ఉంటాం కానీ, నిజానికి ఇవి రెండూ వేరు వేరు. రుచి ఒకటే, వండే పద్ధతి ఒకటే కాబట్టి కలిపి చెప్పేస్తూ ఉంటాం. సొర కాయ పొడుగ్గా ఉంటే, ఆనప కాయ పొట్టిగా, గుండ్రంగా ఉంటుంది. ఇది ప్రత్యేకించి ఎసిడిటీనీ, బ్లోటింగ్ నీ, గుండెల్లో మంటనీ తగ్గిస్తుంది.
గీతలు గీతలుగా దొండాకాయని పోలి ఉండే ఈ పొటల్స్ ఈ సీజన్ కి బాగా అనువైనవి. ఇలా వానలు పడుతుంటే చాలా మంది జలుబూ, దగ్గూ, తలనొప్పితో బాధ పడుతుంటారు. ఈ సమస్యలకి చక్కని పరిష్కారం ఈ పొటల్స్. మిగిలిన రోజుల లో కన్నావానా కాలం లో మాత్రం దుంపలు బంగాళాదుంప క్యరెట్ , ముల్లంగి, బీట్రూట్, చిలగడదుంప మొదలైనవి తినడం మంచిది. ఇవి భూమి లోపల పెరుగుతాయి కాబట్టి వీటి మీద బాక్టీరియా ఉండే అవకాశం తక్కువ.
ఆకాకర కాయఈ సీజన్ లో మాత్రమే దొరికే కూరగాయల్లో ఇది కూడా ఒకటి. చిన్నగా, కొంచెం ముళ్ళు ముళ్ళు గా ఉంటుంది కానీ, ఇది చేసే మేలు సామాన్యమైనది కాదు. ఇందులో ఐరన్, ఫైబర్ తో పాటూ ప్రోటీన్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. మార్కెట్ కి వెళ్ళినప్పుడల్లా ఇవి తెచ్చుకోవడం మర్చిపోకండి. వర్షాకాలానికి పుట్టగొడుగులు కూడా మంచి ఆహార పదార్థం. పళ్లు, కూరగాయల వినియోగానికి ముందు తప్పనిసరిగా వాటిని శుభ్రంగా కడగండి. దీనివల్ల సూక్ష్మజీవులు, పురుగుమందుల అవశేషాలు తొలగిపోతాయి. వర్ష కాలం లో క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బచ్చలికూరలాంటి వాటిని తినటం మానేయాలి.