Bed room: నిమ్మకాయ వాసన మనకు చాలా మంచిది.ఆ వాసన మనకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది.అందుకే నిద్రపోయే ముందు నిమ్మకాయలు ముక్కలుగా కోసి పడుకునే గదిలో లో పెడితే గాలి ఫ్రెష్ గా ఉంటుంది.రూమ్లో నిమ్మకాయలను పెడితే ఇక ప్రత్యేకంగా రూమ్ ప్రెషర్ వాడవలిసిన అవసరం ఉండదు. నిమ్మ వాసనతో గది సువాసన భరితంగా మారుతుంది.పడక గదిలో నిమ్మకాయ కట్ చేసి ఆ ముక్కలు ఒక పక్కగా పెట్టుకుని నిద్రపోతే శ్వాస చక్కగా తీసుకోగలుగుతారు.బెడ్ పక్కన నిమ్మకాయ కూ నిద్రకు అసలు సంబంధమేంటి అనే అని ఆలోచిస్తున్నారా??నిమ్మ మనలో వికారాన్ని తగ్గేలా చేస్తుంది.
ఒత్తిడిని కూడా మాయం చేస్తుంది. ఆతృతను పోగొట్టడం తో పాటు టెన్షన్లను తరిమి కొడుతుంది. మనసును ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. మైండ్ కూడా చురుగ్గా మారుతుంది. ఈ ప్రయోజనాలు అన్ని కలగాలంటే నిమ్మకాయ వాసన పీలుస్తూ ఉండాలి. మనకు ఉన్న బిజీ లైఫ్ లో అది సాధ్యం కాకపోవచ్చు. అందుకే… నిద్రపోయేటప్పుడు నిమ్మకాయ కోసి… బెడ్ పక్కన ఒక గిన్నెలో పెట్టుకుంటే ఇక గది మొత్తం ఆ వాసన తో నిండుతుంది. అప్పుడు ఇక మనం అదే గాలిని పీల్చడం వలన మనలో టెన్షన్స్ అన్నీ దూరమవుతాయి. మీలో టెన్షన్ బాగా ఎక్కువగా ఉంటే అదే గదిలో వేర్వేరు ప్లేస్ లో నిమ్మకాయలు కట్ చేసి గిన్నెలో పెట్టుకోండి . దీనివల్ల ఎక్కువ సువాసన గాలి లో ఉంటుంది. మరింత ఎక్కువగా టెన్షన్ తగ్గుముఖం పడుతుంది.
టెన్షన్ లేకుండా ఉన్నపుడే బ్రెయిన్ బాగా పని చేస్తుంటుంది. మీరు వర్క్ చేసే ప్లేస్ లో కూడా ఇలా చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందని మరువకండి.కాబట్టి బోలెడన్ని డబ్బులు పోసి రూమ్ ఫ్రెషనర్ వాడటం కంటే తక్కువ ధరలో దొరికే నిమ్మకాయ లను వాడడం వలన ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.