32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

National Almond Day Recipes: జాతీయ బాదం దినోత్సవం రోజు తప్పకుండా ట్రై చేయవల్సిన బాదం వంటకాలు

National Almond Day Recipes 2023
Share

National Almond Day Recipes : మన ఆరోగ్యానికి మంచివైనా డ్రై ఫ్రూట్స్ లో బాదంపప్పు కూడా ఒకటి.. బాదం డే అంటూ ఒకటి ఉందని మీకు తెలుసా.. జనవరి 23న ఇండియా బాదం డే గా జరుపుకుంటున్నాం.. అటువంటి బాదం పప్పును ప్రతి రోజూ మనం తీసుకోవాలి. రోజూ నానబెట్టిన బాదం తిని బోర్ కొడుతుందా.!? అయితే బాదంపప్పుతో ఈ రెసిపీస్ చేసుకొని తినండి.. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. బాదం పప్పులతో తయారు చేసే పది రెసిపిస్ మీకోసం..

National Almond Day Recipes 2023 / బాదం దినోత్సవం: January 23 is celebrated in India as National Almond Day for its huge health benefits
National Almond Day Recipes 2023 / బాదం దినోత్సవం: January 23 is celebrated in India as National Almond Day for its huge health benefits

బాదం కుల్ఫీ..
కావలసినవి..
బాదంపప్పు అర కప్పు, పాలు అర లీటర్, పంచదార నాలుగు చెంచాలు, యాలుకలు రెండు, కుంకుమ పువ్వు కొద్దిగా

ముందుగా పాలను స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు బాదంపప్పులను పొట్టు తీయకుండానే మిక్సీ జార్లో వేసి అందులోనే యాలకులు కూడా వేసి బరకగా పొడి చేసుకోవాలి. పాలు బాగా మరిగాక అందులో ఈ పొడిని వేసి సన్నని మంట మీద తిప్పుతూ ఉండాలి. ఇలాగే 30 నిమిషాల పాటు పాలను అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి ఇందులో పంచదార కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే కుంకుమపువ్వు కూడా ఉంటే కాస్త వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. సుమారు 45 నిమిషాల పాటు పాలను మీడియం ఫ్లేమ్ లో మరిగించుకుంటే బాదం మిశ్రమం దగ్గరికి వస్తుంది. తరువాత గ్లాసులో ఈ మిశ్రమాన్ని పోసి అందులోనే ఐస్ పుల్లలు కూడా పెట్టి.. ఎనిమిది గంటలపాటు డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి . అంతే బాదం కుల్ఫీ తినటానికి రెడీ..

బాదం లడ్డు..
కావలసినవి..
ఒక కప్పు బాదంపప్పు, ముప్పావు కప్పు బెల్లం, నాలుగు చెంచాలు నెయ్యి, ఒక చెంచా యాలకుల పొడి.

ముందుగా బాదం పప్పులను పెనం మీద వేయించుకోవాలి. తరువాత బాదంపప్పును మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తరువాత అందులో బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. లేదు అంటే బెల్లం తురుము చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాదం పొడిని ఒక ప్లేట్లో వేసుకొని అందులో బెల్లం తరుగు, యాలకుల పొడి నెయ్యి వేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పైన డెకరేషన్ కోసం చిన్న బాదం పప్పులను పెట్టుకుంటే చూడటానికి అందంగా కనిపిస్తాయి. ప్రతిరోజు ఈ లడ్డు ఒకటి తింటే అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.

National Almond Day: జనవరి 23న ఇండియా బాదం డే గా జరుపుకుంటున్నాం

బాదం చికెన్ మోమోస్..

కావాల్సిన పదార్థాలు
చికెన్ 250 గ్రాములు (బోన్ లెస్), వెల్లుల్లి ఒకటి, క్యారెట్ ఒకటి, స్ప్రింగ్ ఆనియన్ 3, అల్లం చిన్న ముక్క, అన్నింటినీ సన్నగా తరిగి పెట్టుకోవాలి.
సోయా సాస్టర్ 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకీ తగినంత. బాదం 4.

తయారీ విధానం
చికెన్ ఓ గిన్నెలో తీసుకుని సన్నగా తరగాలి. దానిలో బాదం తప్పా.. మిగిలిన పదార్థాలన్నీ వేసి సమాన పరిమాణంలో ఉండే బాల్స్‌గా తయారు చేసుకోవాలి. అనంతరం ఈ బాల్స్‌ను సన్నగా తరిగిన బాదంపప్పులో రోల్ చేయాలి. ఇలా సిద్ధం చేసుకున్న వాటిని.. ఒక ప్లేట్‌లో జాగ్రత్తగా ఉంచి.. స్టీమర్‌ మీద 15 నిమిషాల పాటు ఉడికించాలి. వేడి సమానంగా ఉంచుతూ.. ఆవిరి మీద ఉడికనివ్వాలి. అనంతరం వీటిని కాస్త ఫ్రై చేసుకుని.. గోల్డెన్ కలర్ వచ్చాక దించేసుకోవాలి. వీటిని మీకు ఇష్టమైన కెచప్​తో లేదా గ్రీన్ చట్నీతో సేవించవచ్చు. మీ ఫుడ్​లో నూనె వద్దు అనుకుంటే.. వీటిని ఉడికించిన వెంటనే ఫ్రై చేయకుండా కూడా హ్యాపీగా తినచ్చు.

పన్నీర్ బాదం కర్రీ..
కావలసినవి
పనీర్ – 300 గ్రాములు బాదం అర కప్పు, ఉల్లిపాయలు – 2, టొమాటోలు – 4 , అల్లం – 1, వెల్లుల్లి – 4 లవంగాలు ఎండు మిరపకాయలు – 3 కొత్తిమీర పొడి – చెంచాలు, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ – చెంచాలు, గరం మసాలా పొడి – చెంచా, పసుపు పొడి – 1/2 చెంచా, చక్కెర – 1/2 చెంచా, బే ఆకు – 1, నెయ్యి లేదా నూనె – చెంచా, ఉప్పు – రుచికి సరిపడా.

ముందుగా పొయ్యి వెలిగించి బాండీ పెట్టి అందులో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం అన్ని వేసుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలను కూడా వేసుకోవాలి. బాదం పప్పును మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని పైన చల్లుకోవాలి. అంతే పన్నీర్ బాదం కర్రీ.

బాదం పాలు తయారీ..

పాలు 1 గ్లాస్, కుంకుమ పువ్వు కొంచెం, బాదం పప్పులు 10, బెల్లం రుచికి తగినంత.

తయారీ విధానం
పాలు మరిగించి దానిలో కుంకుమపువ్వు వేయండి. అవి మరుగుతున్న సమయంలో బాదం పప్పులు వేసి.. ఒకటి లేదా రెండు నిమిషాలు ఉడకనివ్వండి. తరువాత మంట తగ్గించి దానిలో బెల్లం వేసి బాగా కలిపి స్టౌవ్ ఆపేయండి. చల్లారిన తర్వాత ఫ్రిజ్​లో ఉంచి సర్వ్ చేసుకోండి. దానిపై బాదం పలుకులు కూడా చల్లుకోవచ్చు.

బాదం తులసి షోర్బా..
కావలసిన పదార్థాలు: బాదం
పప్పులు 10, తులిసి ఆకులు 10, యాలకులు 3, దాల్చినచెక్క చిన్న ముక్క, లవంగాలు 3, నీరు 1 గ్లాసు, ఉప్పు, మిరియాలపొడి రుచికి తగినంత.

ముందుగా బాదం పప్పల్ని నానబెట్టి, మెత్తగా రుబ్బుకొని ఉంచుకోవాలి. దానిలో నీరు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వేసి కలిపి పది నిమిషాలు మరిగించి వడకట్టుకోవాలి. వడకట్టిన నీటిలో ఉప్పు, మిరియాలపొడి కలిపి మరో ఐదు నిమిషాలు మరిగించాలి. కావలి అనుకుంటే 25 గ్రా. క్రీమ్‌ని యాడ్ చేసుకోవచ్చు. వేగించిన బాదం పప్పు ముక్కల్ని పైన అలంకరించుకుని సూప్‌లా తాగండి.

బాదం చట్నీ తయారీ విధానం.. కావాల్సిన పదార్ధాలు:

బాదం పప్పు అర కప్పు, కొత్తిమీర అర కప్పు, పుదీనా అర కప్పు, పచ్చిమిర్చి రెండు,
వెల్లుల్లి రెండు , అల్లం చిన్న ముక్క, చింత పండు పులుసు రెండు టేబుల్ స్పూన్లు, బ్లాక్ సాల్ట్, పంచదార అరచెంచా, చాట్ మసాలా కొద్దిగా

ముందుగా బాదం ను పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చి మిర్చి వేసి స్మూత్ పేస్ట్ లా చేసుకోవాలి. అవసరాన్ని బట్టి నీరు లేదా పెరుగు వేసుకోవాలి. చింత పండు పులుసు కానీ, నిమ్మ రసం కలపాలి. బ్లాక్ సాల్ట్, పంచదార, చాట్ మసాలా కూడా కలిపి బాగా కలపాలి. స్పైసీ గా ఉండే బాదం చట్నీ రెడీ. పరాఠాలతో తింటే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది.

బాదాం హ‌ల్వా త‌యారీ..

కావలసిన పదార్థాలు..
బాదం పప్పు ఒక కప్పు, నెయ్యి ఒక కప్పు, చక్కెర ఒక కప్పు, కుంకుమపువ్వు చిటికెడు, యాలకులపొడి అర టీస్పూన్‌, బొంబాయి రవ్వ ఒక టేబుల్‌ స్పూన్‌, డ్రై ఫ్రూట్స్‌ పావు కప్పు.

బాదం పప్పును బాగా కడిగి గంటపాటు నానబెట్టి ఉడికించి పొట్టుతీసి పెట్టుకోవాలి. అర కప్పు పాలు, పొట్టుతీసిన బాదం పప్పును మిక్సీజార్‌లో వేసి మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. స్టవ్‌ మీద మందపాటి కడాయి పెట్టి ఒక టీస్పూన్‌ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్‌ వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఉప్మా రవ్వ దోరగా వేయించాక బాదం మిశ్రమాన్ని వేసి ఇంకో రెండు నిమిషాలు వేయించాలి. మిగతా పాలు పోసి ఐదు నిమిషాలు ఆపకుండా కలుపుతూ సన్నటి మంటపై ఉడికించాలి. చక్కెర, యాలకుల పొడి, పాలలో నానబెట్టిన కుంకుమపువ్వు వేసి కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ దగ్గరపడే వరకు కలపాలి. చివరగా వేయించిన డ్రై ఫ్రూట్స్‌ జతచేస్తే నోరూరించే బాదం హల్వా సిద్ధం.

బాదం – జీడిపప్పు కర్రీ..
కావలసినవి..
1/2 కప్పు – 3 గంటలు నానబెట్టిన బాదం, 20 – 1 గంట నానబెట్టిన జీడిపప్పు, 1 టీస్పూన్ – జీలకర్ర, 1 పెద్ద ఉల్లిపాయ , 1 టమోటా,
1 టేబుల్ స్పూన్ – వెల్లుల్లి అల్లం పేస్ట్, కొత్తిమీర తరుగు,
1 టేబుల్ స్పూన్ – నెయ్యి, బిర్యానీ ఆకు 1, యాలుకాలు 1, దాల్చిన చెక్క చిన్నముక్క,
1 లవంగం, కారం ఒక చెంచా
చిటికెడు – పసుపు పొడి,
చిటికెడు – గరం మసాలా పొడి,
రుచికి సరిపడినంత ఉప్పు.
ముందుగా బాగా జీడిపప్పులను బాగా నానబెట్టుకుని వాటిని ఒక గ్లాస్ నీళ్లు పోసి ప్రెజర్ కుక్కర్ లో ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఆ నీటిని పక్కన పెట్టుకొని ఆ పప్పులో నువ్వు తీసి పక్కన పెట్టుకోవాలి బాదంపప్పు పొట్టు కూడా తీయాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టి దాల్చిన చెక్క, యలుకాలు, బిర్యాని ఆకు వేసి వేయించుకొని .. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి .తర్వాత సన్నగా తరిగిన టమాటా వేసుకోవాలి . అందులో ఉన్న నీటిని ఇప్పుడు గ్రేవీ కోసం పోసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా అన్ని వేసుకోవాలి. ఐదు నిమిషాలు పాటు ఉడికించిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకుంటే బాదం జీడిపప్పు కర్రీ తినటానికి రెడీ.

Sugar Cane: అమ్మాయిలు డైట్ అంటూ చెరుకుగడ తినడం లేదా.!? ఈ ప్రయోజనాలు మిస్స్ అవుతారు చూసుకోండి..!


Share

Related posts

రోజూ బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల కలిగే లాభాలివే..?

Teja

Kamanchi: ఈ మొక్క ఎక్కడ కనిపించినా వదలకండి.. వేళ్ళతో సహా తెచ్చుకోండి..! 

bharani jella

Bigg boss 4: ముక్కు అవినాష్ లవ్ స్టోరీని బయటపెట్టేసిన అవినాష్ తమ్ముడు అజయ్?

Varun G