కవాటం ఉన్న ఎన్-95 మాస్కులు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేవని, దీనివల్ల వైరస్ సోకే ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల ‘డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్’ హెచ్చరించింది. అందువల్ల ఇలాంటి ఎన్-95 మాస్కులను ప్రజలు వినియోగించవద్దని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల వైద్యవిద్య శాఖ ముఖ్య కార్యదర్శులకు లేఖ రాసింది.
వైద్య సిబ్బంది వినియోగానికి ఉద్దేశించిన మాస్క్‌లను సామాన్య ప్రజలు అనుచిత రీతిలో వినియోగిస్తున్న తీరు తమ దృష్టికి వచ్చిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పేర్కొంది. ఎన్–95 మాస్క్‌లు, ముఖ్యంగా రెస్పిరేటరీ వాల్వ్‌లున్న ఎన్–95 మాస్క్‌ల వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో ప్రజలు సాధారణ మాస్కులు ధరిస్తే చాలని.. ఈ దిశగా ప్రజలను ప్రోత్సహించాలని సూచించింది.రెస్పిరేటరీ వాల్వ్ మాస్క్‌ల వాడడాన్ని ఇప్పటికే పలు దేశాలు నిషేధించాయి. సాధారణంగా ఇలాంటి మాస్క్‌లను పారిశ్రామిక ప్రదేశాలు, ఫ్యాక్టరీలలో పనిచేసే సిబ్బంది ఉపయోగిస్తారట. ఈ రెస్పిరేటరీ వాల్వ్‌లు వాతావరణంలో ఉండే గాలిని శుద్ధి చేసి మనిషికి అందిస్తాయి. ఇదే సమయంలో మనం వదిలిన గాలిని మాత్రం నేరుగా బయటకు పంపించేస్తాయి. దీని పని ఇంతవరకే. ఇవి ప్రత్యేకంగా కరోనా వైరస్ నియంత్రణ కోసం తయారు చేసినవి కావు. ఈ విషయం తెలియక చాలా మంది ఈ మాస్కులను ధరిస్తున్నారు. వ్యాపారులు కూడా దీన్ని బాగా సొమ్ము చేసుకుంటున్నారు.
ఒకవేళ కరోనా వైరస్ సోకిన వారు ఈ కవాటాలున్న ఎన్ 95 మాస్కులను ధరిస్తే.. వారు వదిలిన గాలి నేరుగా బయటకి వస్తుంది కాబట్టి.. వైరస్ ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంది.మనం వదిలేసిన గాలిని అవి నేరుగా అక్కడి వాతావరణంలోకి వదిలేస్తాయి. దీనివల్ల వైరస్ కట్టడి కోసం మాస్కులను ధరించాలనే నిబంధనకు అర్థమే లేకుండాపోతుంది’ అని పేర్కొంది.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం వస్త్రంతో తయారు చేసిన మాస్కులను ధరించడమే చాలా సురక్షితం అని శాన్ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా సహా అమెరికాలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నాయి.
ఇంట్లో తయారు చేసిన మాస్కులను వాడాలని కేంద్ర ప్రభుత్వం కూడా గతంలోనే సూచించింది. మాస్కు ముఖాన్ని సరిగ్గా కవర్ చేసేవిధంగా ఉండాలని, దీంతో పాటు మాస్కుకు ఇరువైపులా ఖాళీలు లేకుండా చూసుకోవాలని హెచ్చరించింది. అలాగే ఒకరి మాస్కు ఇంకొకరు ధరించకూడదని పేర్కొంది. రోజూ మాస్కులను శుభ్రం చేసుకోవాలని, వేడి నేటిలో కనీసం 5 నిమిషాల పాటు ఉంచి ఆరబెట్టాలని ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేసింది.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం వస్త్రంతో తయారు చేసిన మాస్కులను ధరించడమే చాలా సురక్షితం అని శాన్ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా సహా అమెరికాలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నాయి.మాస్కుల విషయంలో జాగరత్త తీసుకోవడం ఎంతైన మంచిది. నిపుణుల సలహాలు సూచనలు పాటిస్తూ కరోనా నుండి రక్షణ పొందుదాం.