couples: కొత్తగా పెళ్లి అయినవారు ,పెళ్లి చేసుకోవాలనుకుంటున్నవారు, పడకగది  చేరుకునే ముందు వీటిని తెలుసుకోండి!!

Share

couples:  కొత్తగా పెళ్లయిన   జంటల్లోశృంగార  సుఖాన్ని అనుభవించాలని,మధురానుభూతులు మూటకట్టుకోవాలని   ఎదురుచూస్తుంటారు.  భాగస్వామి కి ఉన్న అలవాట్లు  కారణం గా  ఆ సుఖాన్ని పూర్తిగా  అందుకోలేకపోతారు. అసలే కొత్త  దానికి తోడు కొన్ని చెడ్డ అలవాటు లు కూడా  ఉంటే ఒకరితో ఒకరు  మనసు విప్పి  చెప్పుకోలేక,చెప్తే ఎదుటివారు    ఏమనుకుంటారోనన్న సందేహం.. దాంతో అటు పూర్తిగా అనుభవించలేక చెప్పలేక నలిగిపోతుంటారు.   అందుకే  కొత్తగా పెళ్లయిన ప్రతి జంట ముఖ్యమైన కొన్ని ఆరోగ్య సూత్రాలను తెలుసుకుని పాటిస్తే శృంగార జీవితం సుఖఃవంతం గా గడపవచ్చు.

నోటి దుర్వాసన వస్తుంటే  మాట్లాడే  సమయం లో ముద్దుపెట్టుకునే సమయంలో ను చాలా ఇబ్బందిగా చిరాకు గా ఉంటుంది.ఎప్పుడు ఆపేద్దామా అని ఉంటుంది.  ఈ సమస్య నుండి బయట పడాలంటే, నోటి సంబందించిన సమస్యలు ఏమైనా ఉంటే డాక్టర్ ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. దానితో పాటు   పడక గది  చేరేముందు  బ్రష్ చేసుకుని నోటిని శుభ్రపరుచుకోవాలి. దంతాలు ,నాలుక శుభ్రం గా ఉంటే ఎలాంటి చెడువాసన రాదు. ఎంతసేపు అయినా ముద్దును ఆస్వాదించవచ్చు.ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే  చెప్పమని మీ భాగస్వామి కి చెప్పండి.. ఉల్లిపాయ , వెల్లుల్లి వంటి ఘాటు  వాసనవచ్చే పదార్థాలను  సురేంగారానికి ముందు  తినకపోవడం అనేది చాలా  మంచిది. ఇంకా ముఖ్యంగా పొగతాగడం మానేయటం ఉత్తమం.  చెమట ఎక్కువగా పట్టడం,  చెమటనుండి వచ్చే  చెడు వాసనకూడా  శృంగార సుఖానికి   ఆటంకం  కలిగిస్తాయి. ఈ సమస్య పరిష్కారం కోసం  గోరువెచ్చటి నీటితో స్నానం చేసిన తరువాత డియోడరెంట్ వినియోగించడం మంచిది. దీనితో పాటు ఎక్కువ నీరు తాగడం, పల్చటి  లోదుస్తులు  వేసుకోవటం,  వర్క్ తో  ఎంతగా అలసిన కూడా కచ్చితం గా స్నానం  చేసి పడకగది   లో కి  వెళ్ళటం వల్ల కూడా సమస్యను తగ్గించుకోవచ్చు.

ఉద్రేకం ఎక్కువ స్త్రీలలో  యు.టి.ఐ మరియు బ్లాడర్ ఇన్ఫెక్షన్ కలుగుతాయి. ఇది తగ్గాలంటే శృంగారం  కాగానే కచ్చితం గా  మూత్ర విసర్జన  కు వెళ్లి రావాలి.ఇలా చేయటం వలన  బ్యాక్టీరియా బయటకుపోయి ఇన్ఫెక్షన్‌స్  రావు . ఇద్దరు  వ్యక్తిగత శుభ్రత  పాటిస్తే  శృంగార జీవితం సుఖమయం అవుతుంది. ఒకవేళ మీ భాగస్వామి కి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అడిగి తెలుసుకుని  దాన్ని  పరిష్కరించుకోండి .


Share

Related posts

ఈడీ ఎదుట చిదంబరం

Siva Prasad

హైదరాబాద్ వర్షాలపై రియాక్ట్ అయిన చంద్రబాబు..!!

sekhar

Abhijith : అదిరిపోయే ఆఫర్ కొట్టేసిన బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అభిజిత్..??

sekhar