ఈ సృష్టిలో ప్రాణులకు శృంగారపరమైన కోరికలు కలగడం చాల సహజం. అలాగే స్త్రీ పురుషులకు కామ కోరికలు ఉండటం అనేది కూడాచాల సాధారణ విషయం . అది అవసరం కూడా. అయితే శృంగారం శృతి మించి చేస్తే ప్రమాదం. అలాంటి సందర్భం లో నే మీరు శృంగారానికి బానిసగా మారిపోతారు. లైంగిక వ్యసనం ఉందొ లేదో తెలుసుకోవడానికి అనేక విధానాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం ..
శృంగార పరమయిన ఆలొచనలతొ మీ మనస్సు నిండి ఉండడం వల్ల మీకు వేరే ఏ విషయం గురించిన ఆలొచనలు ఉండవు. మీరు శృంగారానికి బానిస అయ్యారని చెప్పడానికి ఇది ఖచ్చితమైన లక్షణం. ఎప్పుడు శృంగార పరమైన చిత్రాలను ఎక్కువగా చూస్తూ ప్రతి రోజూ ఎక్కువసార్లు హస్త ప్రయోగం చేసే వారుకూడా శృంగారానికి బానిసగా అయ్యారు అని చెప్పే లక్షణం.
అలా బానిసగా మారితే అది మిమ్మల్ని శారీరకంగా మరియు మానసికంగా బలహీనులను చేయడం తో పాటు మిమ్మల్ని సమాజంలో చెడ్డ వ్యక్తిగా తయారుచేస్తుంది. మనస్సు ను నియంత్రణలో ఉంచుకుంటే ఆరోగ్యకరమైన లైంగిక కోరికలు మాత్రమే కలుగుతాయి. సహజం గా శృంగారం లో పాల్గొనడానికి అవకాశం లేకపోతే, నిరాశ చెందుతారు. ఎవరైనా శృంగారానికి బానిస గా ఉన్నారు అంటే , వారు తమ లైంగిక అలవాట్లతో పాటు వింత మనస్తత్వం కలిగిన వారుగా ఉంటారు. అలా బానిస గా మారిన వ్యక్తి చాలా మంది తో లైంగిక సంబంధాలు కలిగి ఉంటారు.
స్నేహం గా నటిస్తూ ఎదుటివారి తో ఎన్ని భంగిమల్లో రతి క్రీడ చేయవచ్చు అని ఆలోచిస్తూనే ఉంటారు. అలాగే ఎక్కువమంది శృంగార భాగస్వాములను కలిగి ఉండటంతో పాటు, శృంగారం కోసం ఎవరినైనా మాటలతో కానీ చేతలతో కానీ మోసం చేసి లోబరుచుకుంటారు. ఆ వ్యక్తి జీవితంలో ఆధిపత్యం చేసేది ఏదైనా ఉంది అంటే అది కేవలం శృంగారం మాత్రమే అని చెప్పవచ్చు. శృంగారం కోసం పలు సందర్భాల్లో వ్యక్తి నేర పూరిత కార్యకలాపాలను కూడా చేసేస్తాడు.
ఇందులో భాగం అస్లీలం తో కూడిన మాటలు భాగస్వామి తో వింత ,వింత కోరికలు తీర్చుకోవడం , కొట్టడం, అత్యాచారం, పిల్లలపై వేధింపులు వంటివి ఉంటాయి.ఈ లక్షణాలు కనిపించినవారు వెంటనే డాక్టర్ ని సంప్రదించి వారు సూచించిన సలహాలు పాటించాలి.