కివిలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. అలాగే, తగిన మోతాదుల్లో విటమిన్ ఏ, ఈ మరియు కే కూడా కలవు. అలాగే పొటాషియం, కేల్షియం, మెగ్నీషియం మరియు ఫాస్ఫరస్ వంటి మినరల్ కంటెంట్ కూడా ఇందులో ఉన్నాయి. వీటన్నిటితో పాటు డైటరీ ఫైబర్ కూడా ఇందులో పుష్కలంగా లభిస్తుంది.
ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ ఫ్రూట్ లో కార్బోహైడ్రేట్స్ అలాగే కేలరీలు తక్కువగా ఉంటాయి.తరచూ డైజెస్టివ్ ప్రాబ్లెమ్స్ తో సఫరయ్యేవారు కివీ ఫ్రూట్ ను తినడం ద్వారా బెనిఫిట్ పొందుతారు.. డైజేషన్ ను ఇంప్రూవ్ చేయడంతో పాటు కివి ఫ్రూట్ కాన్స్టిపేషన్ సమస్యను కూడా నివారిస్తుందని డైజెస్టివ్ ట్రాక్ట్ ను హెల్తీగా ఉంచేందుకు ఈ ఫ్రూట్ లో ఉండే ప్రీ బయోటిక్స్ తో పాటు ఫైబర్ హెల్ప్ చేస్తుందట.కివి ఫ్రూట్ లో విటమిన్ సి కంటెంట్ అధికంగా లభిస్తుంది.
ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. ఈ ఫ్రూట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ జలుబు లేదా ఫ్లూ వంటి అనారోగ్యానికి గురయ్యే రిస్క్ ను తగ్గిస్తాయి. కివిలో విటమిన్ ఈ కూడా లభ్యమవుతుంది. కివి ఫ్రూట్ కంటి చూపును పెంచుతుంది .కంటికి స్ట్రెయిన్ కలిగించే హానీకర అల్ట్రా వయెలెట్ లైట్ నుంచి మాక్యులాను సంరక్షిస్తుంది. కివి ఫ్రూట్ లో విటమిన్ సి ,ఏ ,ఈ అలాగే ఇందులో పోలీఫెనాల్స్ తో పాటు పొటాషియం కూడా సమృద్ధిగా లభిస్తుంది. బ్లడ్ లోని ఫాట్ కంటెంట్ మోతాదును తగ్గిస్తాయి.
ఆస్ప్రిన్ డ్రగ్ వంటి ఎఫెక్ట్స్ నే కివి ఫ్రూట్ ద్వారా పొందవచ్చని రీసర్చ్ లో తేలింది. పైగా, ఆస్ప్రిన్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ ఈ ఫ్రూట్ వలన కలగవు.యాక్నేపై పోరాడే యాంటీ ఇన్ఫ్లమేటరీ కివి ఫ్రూట్ లో ఉంది . ఈ ఫ్రూట్ లో ఉండే విటమిన్ ఈ స్కిన్ లోని మాయిశ్చర్ ను నిలిపి ఉంచుతుంది. ఎలాస్టిసిటీను ఇంప్రూవ్ చేస్తుంది. మెత్తగా చేసిన కివి ని స్కిన్ పై అప్లై చేసుకుని ఆరనిచ్చి కడిగేసుకోవాలి . యాక్నే తగ్గిపోయేవరకు రోజుకొక్కసారి ఈ విధం గా చేయాలి .
పడుకునే ముందు రెండు కివి ఫ్రూట్స్ ను తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది.నిజానికి, ఎన్నో సిట్రస్ ఫ్రూట్స్ అంటే నారింజ అలాగే నిమ్మలో లభించే విటమిన్ సి కంటే రెండు రెట్లు ఎక్కువగా విటమిన్ సి కివిలో లభిస్తుంది. రాత్రి పూట దగ్గు, క్రానిక్ దగ్గు, ముక్కు కారడం, శ్వాస ఇబ్బందులు వంటి వాటిని తగ్గించడంలో కివి ఫ్రూట్ ఎంతగానో హెల్ప్ చేస్తుంది.కివి ఫ్రూట్ నేచురల్ ఎక్స్ఫోలియెంట్ గా పనిచేస్తుంది. డార్క్ లిప్స్ ను ప్రకాశవంతంగా మారుస్తుంది. మ్యాష్ చేసిన కివిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను అలాగే ఒక టీస్పూన్ షుగర్ ను కలపాలి. ఈ పదార్థాలని బాగా కలిపి ఈ మిక్స్ ను పెదాలపై నెమ్మదిగా మసాజ్ చేయాలి వారంలో రెండుసార్లు ఈ లిప్ స్క్రబ్ ను వాడాలి. ఇన్ని లాభాలు ఇచ్చే కివిని మీ డైట్లో ఈ చేర్చుకోవడం మరవొద్దు.