సపోటా అద్భుతమైన రుచిని అందించే ఆరోగ్యకర పండ్లలో ఒకటి. అధిక పోషకాలు కలిగిఉన్న ఈ పండు రుచికరమైన గుజ్జు వల్ల తేలికగా జీర్ణమై, గ్లూకోస్ అధికంగా ఉండడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. ఈ పండులో సమృద్ధిగా విటమిన్లు, మినరల్స్, ఉన్నాయి.
స్థూలకాయ సమస్యకు సపోటా విరుగుడుగా పనిచేస్తుంది.
సపోటా పండులో గ్లూకోజ్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరుకు చాలా ఉపయోగపడుతుంది. సపోటాలోని విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. సపోటాలో క్యాల్షియం, పాస్పరస్, ఐరన్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఎముకల గట్టిదనానికి ఇవి ఎంతో దోహదపడుతాయి.
సపోటా గుజ్జులో ఉండే ఫైబర్లు మలబద్దక లేకుండా చేస్తాయి.
జీర్ణాశయ క్యాన్సర్ కారకాలను సపోటా అడ్డుకుంటుంది.సపోటాలో ఉండే కాల్షియం, ఫాస్పరస్ వల్ల ఎముకల గట్టిపడతాయి.
నిద్రలేమి ఆందోళనతో బాధపడే వ్యక్తులు సపోటా తీసుకోవడం మంచిది.
జలుబు, దగ్గు సమస్యలకు కూడా సపోటా మంచి ఔషదం.
కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్యకు సపోటాతో చెక్ పెట్టవచ్చు.
సపోటాలో ఉండే విటమిన్-A వల్ల కంటికి మేలు చేయడం తోపాటు
వృద్ధాప్యంలో వచ్చే అంధత్వ నివారణకు సపోటా సహాయపడుతుంది.విటమిన్-B, C వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
సపోటాలో ఉండే పిండిపదార్థాలు గర్భిణీలకు, పాలు ఇచ్చే తల్లులకు చాలా మేలు చేస్తాయి.
ఆరోగ్యానికి మేలు చేసే నియాసిన్, కాపర్, ఐరన్ వంటి మూలకాలు కూడా సపోటాలో ఉన్నాయి.
సపోటా నరాల ఒత్తిడిని తగ్గించి ఉపశమనాన్ని ఇస్తుంది.
జుట్టు రాలే సమస్యను కూడా సపోటా అరికడుతుంది.
చుండ్రు సమస్యను తగ్గించడంలోనూ సపోటా బాగా పనిచేస్తుంది.సపోటా జ్యూస్‌ను రోజూ తీసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది.