చేమదుంపలో న్యూట్రిషనల్ వేల్యూ ఎక్కువ. కానీ, చేమ దుంపకు న్యూట్రిషన్ వేల్యూ పరంగా తగినంత ప్రాచుర్యం లభించలేదని చెప్పుకోవాలి.
చేమదుంపలో ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, పొటాషియం, మ్యాంగనీజ్ అలాగే కాపర్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవన్నీ ఆరోగ్యాని సంరక్షించడానికి సహాయం చేస్తాయి. అలాగే, ఇందులో కార్బ్స్ తో పాటు డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇవన్నీ, ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. చేమదుంపలను ఆహారం లో భాగం చేయడం ద్వారా పొందగలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే, ఇది మధుమేహం రిస్క్ ను తగ్గిస్తుంది.డైటరీ ఫైబర్ జీర్ణ క్రియను ను నిదానం చేస్తుంది . దాంతో, శరీరం ఇన్సులిన్ విడుదలను రెగ్యులేట్ చేయగలుగుతుంది. రక్తం లో గ్లూకోజ్ స్థాయి అదుపులో ఉంటుంది. కాబట్టి గ్లైసెమిక్ నియంత్రణ సాధ్యమవుతుంది. రక్త ప్రసరణ కూడా ఇది అభివృద్ధి చేస్తుంది.
ఇందులో పీచుపదార్థం ఎక్కువగా ఉండడం వలనఇది మధుమేహం రిస్క్ ను తగ్గిస్తుంది. చేమదుంప గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువే కావడంతో ఇది డయాబెటిక్స్ కు మంచి ఆప్షన్.సహజంగా డయాబెటిక్స్ కు పీచుపదార్ధాలు ఎక్కువగా తీసుకోమని సూచిస్తారు.ఆ విధంగా కూడా చేమదుంప డయాబెటిక్స్ కు సిఫార్సు చేయదగినదే. చేమదుంప ఉండేహెల్తీ కార్బోహైడ్రేట్, శరీరానికి తగినంతశక్తి ని అందిస్తుంది.
కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉండదు. గుండె ఆరోగ్యంగా ఉండడంతో పాటు పనితీరు కూడామెరుగవుతుంది.చేమదుంపలో ఇమ్యూన్ సిస్టమ్ ను పెంచే లక్షణాలు అనేకం ఉన్నాయి. కంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలనుకునే వారు అలాగేమెరుగు పరచుకోవాలనుకున్నవాళ్ళు చేమదుంపను ఆహారం లో భాగం చేసుకోవాలి.