ఎక్కువ పోషకాల తో ధర తక్కువ తో లభించే గుడ్డును తినడానికి చాలామంది శ్రద్ధ చూపరు. కానీ గుడ్డు తినడం వలన వచ్చే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. గుడ్డు ప్రయోజనాలు తెలుసుకోవడం కోసం పరిశోధకులు ఇంకా ఇంకా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. గుడ్డు తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ప్రజలకు తెలియచేస్తున్నారు.
గుడ్డు తినడం ద్వారా కలిగేకొన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. గుడ్డు క్రమం తప్పకుండ తినడం వలన గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఒక్క గుడ్డు తినగానే కాస్త కడుపు నిండినట్లు అనిపిస్తుంది. గుడ్డు తిన్న తర్వాత అంతగా ఆకలి వేయదు.ఇది బరువు తగ్గడానికి బాగా ఉపయోగ పడుతుంది. ఉడికించి గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. అన్ని వయసుల వారికి అవసరమైన పోషకాలూ గుడ్డునుండి లభిస్తాయి.
రోజూ ఆహారంలో గుడ్డు కూడా ఉండేలా చూసుకుంటే ప్రోటీన్లు, విటమిన్లు, పోషకాలు ఎక్కువగా పొందొచ్చు. ఇక మనం రోజూ రకరకాల ఆహారాలు తీసుకుంటాం కదా. ఆ ఆహారం జీర్ణమై మన శరీరం గ్రహించి, దానిని వినియోగించుకునే క్రమంలో చాలా వ్యర్థాలు బయటకు పంపబడతాయి. కానీ గుడ్డు మాత్రం నూటికి నూరు శాతం మన శరీరానికి ఉపయోగపడుతుంది. గుడ్డు కాకుండా మరే ఆహార పదార్థం ఇంత మంచి లాభాల్ని ఇవ్వలేదు. చిన్నపిల్లలకు ఆరేడు నెలలకు అన్నం పెట్టటం ప్రారంభిస్తారు.
కాబట్టి 8 నెలల నుంచి ఉడికించిన పచ్చసొనతినిపిస్తూ ఉండొచ్చు. అది తినడం వలన పిల్లలకు ఎలాంటి సమస్యలు రావు. పిల్లలకు అవసరం అయినా పోషకాలూ మొత్తం అందులో లభిస్తాయి. నెమ్మదిగా పిల్లలకు ఏడాది నిండే సరికి మొత్తం గుడ్డు మెత్తగా చేసి పెట్టవచ్చు. ఎన్నో ప్రయోజనాలు ఉన్న గుడ్డుని ప్రతి రోజు కనీసం ఒక్కటి అయినా తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.