పిస్తా పప్పు తినడం వలన క్యాన్సర్లు రాకుండా కాపాడుతుందని తాజా పరిశోధనల్లో బయట పండింది . బాదం పప్పును మించి ఎక్కువ పోషక పదార్థాలు పిస్తా పప్పులో దొరుకుతాయి. ఇందులో పొటాషియం, బి6 విటమిన్లుసమృద్ధిగా ఉన్నాయి. అందువల్ల శరీరం ప్రోటీన్లను ఎక్కువగా గ్రహిస్తుంది.
డ్రై ఫ్రూట్స్ అన్నింటితో పోలిస్తే పిస్తా పప్పులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి .పిస్తా లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది కొలోన్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది అని ఒక స్టడీ ఆధారం గా తెలుసుకున్నారు. ఈ స్టడీ జూలై 2020లో “న్యుట్రియెంట్స్” అనే ఇష్యూలో ప్రచురితం అయింది . కేలరీ తీసుకోకూడని డైట్ లో పిస్తాపప్పును కూడా చేర్చుకుంటే బరువు తగ్గే ప్రక్రియకు సహకారం లభిస్తుందని.. అదే సమయంలో బ్లడ్ ప్రెజర్ కూడా తగ్గుతుందని స్టడీ వెల్లడిస్తోంది.
ఈ రెండు గ్రూప్స్ కి చెందినవారు తమ శరీర బరువులో దాదాపు 5 శాతం బరువును తగ్గారని వారి నడుము చుట్టూ కొలత కూడా తగ్గిందని రీసెర్చర్స్ తెలిపారు . అనేక రకాల కేన్సర్ కారక వైరస్ ను పిస్తా పప్పు దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.బాదం పప్పు కన్నాతో పోలిస్తే పిస్తా పప్పులలో అధికంగా పోషక పదార్థాలు ఉంటాయి. దీని లో అధికంగా ఉండే పొటాషియం వల్ల శరీరంలో ద్రవాల నియంత్రణకు సహాయపడుతుంది.
కాబట్టి క్యాన్సర్లు రాకుండా పిస్తా పప్పు అద్భుతంగా పనిచేస్తుందని తెలిసింది. వీటిలో విటమిన్ బి6 కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవి ఎక్కువగా తిన్నా కొలెస్ట్రాల్ పెరగదట. మామూలుగా నట్స్ తినాలంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే కదా దూరంగా ఉంటాం.. మరి ఆ దోషం ఇందులో లేనట్టే !