Oats: ఓట్స్ లో ఎన్నో అద్భుతమైన పోషకాలను కలిగి ఉన్నాయి.. ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా ఓట్స్ ఎంతో మేలు చేస్తాయి. ఇక ఓట్స్ ని మన బాడీ ఫిట్నెస్ కోసం ఉపయోగిస్తాము.డైట్ లో ఉన్నవారికి చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా ఓట్స్ తో తయారు చేసుకొనే సీరం నీ ప్రతిరోజు వాడితే మీరు ఊహించని స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.ఇప్పుడు చెప్పబోయే టిప్ ను ఫాలో చేస్తే మీ అందం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంకెందుకు ఆలస్యం ఓట్స్ తో సీరం ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక కప్పులో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ ను వేసుకోవాలి. అందులో ఒక కప్పు కొబ్బరి పాల మిశ్రమాన్ని తీసుకోవాలి. ఈ రెండింటిని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. మరోవైపు స్టౌ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. బాగా నీరు మరిగిన తరువాత అందులో అవిసె గింజలను వేసి 10 నుంచి 17 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఆ తరువాత పల్చని బట్టను తీసుకుని అందులో అవిసె గింజల జల్ ను వేరు చేసుకోవాలి.
తరువాత మనం నానబెట్టిన కొబ్బరి పాలు, ఓట్స్ నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేటు చేసుకోవాలి. అలాగే ఆ జ్యూస్ లోకి ఆల్రెడీ మనం చేసుకున్న అవిస గింజల జల్ ను వేసి మళ్లీ మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా చేసిన తర్వాత చివరలో అలోవెరా జెల్ నాలుగు చుక్కలు లావెండర్ ఎసెన్సీఎల్ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేంతవరకు మరోసారి మిక్స్ చేసుకోవాలి. అంతే మన ముఖాన్ని అందంగా తయారు చేసే సీరం సిద్ధమైనట్లే.. అంతేకాకుండా ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవచ్చు.