Omega -3 Rich Foods: ఒమెగా -3 ఉండే అయిదు శాఖాహార పదార్ధాలు ఇవే…!!

Share

Omega -3 Rich Foods: ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ వారు తీసుకునే అహార పదార్ధాల్లో ఆరోగ్యకమైన పోషకాలను తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు. సముద్రపు ఆహార పదార్ధాలతో పాటు ఇతర ఆరోగ్యకరమైన పోషకాలను తీసుకుంటే మెదడు, గుండె, పునరుత్పత్తి వ్యవస్థతో సహా శరీరంలోని అన్ని ముఖ్యమైన భాగాలు బాగా పని చేస్తాయి. ఈ పోషకాలను క్రమం తప్పకుండా తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు నిలువరించడంతో పాటు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఒమెగా – 3 ఉండే ఆహార పదార్ధాలను తీసుకోవాలి. ఒమెగా – 3 ఎక్కువగా మాంసాహారంలో పుష్కలంగా ఉంటుందని భావిస్తుంటారు కానీ శాఖాహారంలోనూ ఒమెగా – 3 ఉంటుంది.

Omega -3 Rich Foods:
 Omega -3 Rich Foods:

Omega -3 Rich Foods: ఒమెగా – 3 ఉండే అయిదు ముఖ్యమైన శాఖాహార పదార్ధాలు ఏమిటంటే…

  • చియా విత్తనాలు.. అత్యంత ప్రజాదరణ పొందిన, అధునాతన విత్తనాలలో ఒకటి చియా విత్తనాలు. ఇవి అధ్బతమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వెయిట్ లాస్, గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ఉపకరించే ఆహార పదార్ధంగా చియా విత్తనాలకు గుర్తింపు ఉంది. ఒక గుప్పెడు చియా విత్తనాల్లో అయిదు గ్రాముల ఒమెగా – 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. జనపనార గింజలు, అవిసె గింజల్లోనూ ఒమెగా – 3 ఉంటుంది.
  • సముద్రపు పాచి ..శాఖాహారులకు ఉత్తమమైన ఫుడ్ ఇది. సముద్రపు పాచి, నోరి, స్పిరులినా వంటి వాటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.
  • అక్రోట్లు.. వాల్ నట్స్ మెదడు, గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ప్రతి రోజు మూడు నాలుగు వాల్ నట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతి రోజు నానబెట్టిన వాల్ నట్స్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. వాల్ నట్స్ లో ఒమెగా 3 పుష్కలంగా ఉంటుంది. అదే విధంగా ఎడమామ్ .. ఇది ఒక సోయాబీన్ ఉత్పత్తి. కిడ్నీ బీన్స్ లోనూ ఒమెగా – 3 అధికంగా ఉంటుంది. ఇవి తినని వాళ్లు ఒమెగా – 3 సప్లిమెంట్ల రూపంలోనూ తీసుకోవచ్చు.

Share

Related posts

Sampoornesh Babu: నా పుట్టినరోజు సిడిపిని నేనే రిలీజ్ చేసుకుంటానంటున్న సంపూర్ణేష్ బాబు..!!

bharani jella

‘బాబు’ చెప్పినట్టే వింటాం

somaraju sharma

ఆ ప్రొడ్యూసర్ ఆఫీస్ కి వెళ్తే నాతో బలవంతంగా సినిమా చేయించారు అంటూ నాని కామెంట్స్..!!

sekhar