ఉల్లిపాయలు చాలా ఘాటైన వాసనను కలిగి ఉంటాయి. అందువల్ల వాటిని కట్ చేస్తుంటే ఆ పవర్‌కు మన కళ్ల నుంచి నీళ్లు వస్తాయి. ఉల్లిపాయ లేకుండా నిత్యం మన ఇండ్లలో ఏ కూరా పూర్తి కాదు. అయితే ఉల్లిపాయ జ్యూస్ శిరోజాల సమస్యల నుంచి బయట పడేస్తుందని, వెంట్రుకల సంరక్షణకు అది ఎంతగానో ఉపయోగపడుతుందని ఇప్పటికే అనేక చోట్ల మనం చదివాం. అయితే మరి ఇది నిజమేనా ? అంటే…
ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం.. ఉల్లిపాయ రసం శిరోజాల సమస్యలను పరిష్కరిస్తుంది. ఇది నిజమే. ఫేక్ కాదు. అందువల్ల ఉల్లిపాయ జ్యూస్‌ను శిరోజాలకు అప్లై చేసి తద్వారా అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు. ఉల్లిపాయల్లో సల్ఫేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది అలొపెషియా అనే వెంట్రుకల సమస్యను తగ్గిస్తుంది. అలాగే డ్రై లేదా దురదగా ఉండే స్కాల్ప్, హెయిర్ లాస్, డాండ్రఫ్, వెంట్రుకలు పలుచబడడం, డ్రై హెయిర్, ప్రిమేచర్ గ్రేయింగ్, స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ వంటి ఎన్నో సమస్యలకు ఉల్లిపాయ రసం చక్కగా పనిచేస్తుంది.
ఉల్లిపాయల్లో ఉండే సల్ఫేట్ వెంట్రుకలు పెరిగేందుకు సహాయపడుతుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. కొల్లాజెన్ వల్ల ఆరోగ్యవంతమైన చర్మ కణాలు తయారవుతాయి. అలాగే శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. ఉల్లిపాయల్లో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శిరోజాలకు ఎంతగానో మేలు చేస్తాయి. ఉల్లిపాయలు యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల స్కాల్ప్ ఇన్ఫెక్షన్లు ఉంటే పోతాయి. అలాగే స్కాల్ప్ ఆరోగ్యంగా మారుతుంది. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.
రెండు మీడియం సైజ్ ఎర్ర ఉల్లిపాయలను తీసుకుని కట్ చేసి వాటిని మిక్సీలో వేసి జ్యూస్ తీయాలి. అవసరం అనుకుంటే నీటిని కలపాలి. అనంతరం శుభ్రమైన వస్త్రంలో ఆ జ్యూస్ ను వేసి అందులో నుంచి మళ్లీ రసాన్ని పిండుతూ వేరు చేయాలి. అలా వచ్చిన రసాన్ని సీసాలో భద్ర పరుచుకోవాలి. దాన్ని జుట్టుకు బాగా అప్లై చేసి 1 గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే వెంట్రుకల సమస్యలు అన్నీ పోతాయి.