Onion Pickle: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు.. ఉల్లిపాయలలో మన శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ఉన్నాయి.. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి.. పులిపై పైన తినడానికి కొంతమంది ఇష్టపడరు.. ఉల్లిపాయతో పచ్చడి అంటే అందరూ ఇష్టంగా లాగించేస్తారు..! ఉల్లిపాయ పచ్చడికి కావలసిన పదార్థాలు.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉల్లిపాయ పచ్చడికి కావలసిన పదార్ధాలు..!
తరిగిన ఉల్లిపాయలు -2, ఎండు మిర్చి -15, వెల్లుల్లి రెబ్బలు -పది, చింతపండు 50 గ్రాములు, ధనియాలు -రెండు చెంచాలు, మెంతులు – అర టీ స్పూన్, జీలకర్ర – ఒక చెంచా.
ముందుగా ఒక బాండీ పట్టుకొని అందులో రెండు చెంచాల నూనె వేసి ఉల్లిపాయలను దోరగా వేయించాలి వాటిని తీసి పక్కన పెట్టి తరువాత ఎండుమిర్చి, జీలకర్ర , ధనియాలు, మెంతులు, వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, జీలకర్ర, మెంతులు, నానబెట్టుకున్న చింతపండు, తగినంత వేసి మిక్సీ పట్టుకోవాలి..

బాండి లో పోపు సిద్ధం చేసుకొని ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ పచ్చడి అందులో వేయాలి. పోపు వేసుకుంటే ఉల్లిపాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది.. అంతే తినడానికి ఉల్లిపాయ పచ్చడి రెడీ. అన్నం, అట్టు, ఇడ్లీ, చపాతీ ఎందులోకైనా ఉల్లిపాయ పచ్చడి తినడానికి చాలా బాగుంటుంది. ఉల్లిపాయలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఎముకలను దృఢంగా ఉంచుతాయి. ఉల్లిపాయ తింటే జీర్ణక్రియ పెరిగి ఉదర సంబంధిత సమస్యలు రావు. జుట్టుకు అందించడంలో ఉల్లి ముందు ఉంటుంది. డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలకు ఉల్లిపాయ చెక్ పెడుతుంది.