శుభ్రమైన పళ్లు, చిగుళ్లు శరీర ఆరోగ్యంపై అనేక రకాలుగా ప్రభావం చూసిస్తాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మన నోట్లో అనేక రకాల బాక్టీరియా అసంఖ్యాకంగా ఉంటుంది. ఇందులో కొన్ని రకాలు హాని ఆరోగ్యానికి హాని చేస్తాయి. రోజూ మనం పళ్ళు శుభ్రం చేసుకోల్సింది వీటి గురించే. మరికొన్ని రకాలు ఆరోగ్యానికి సహాయకారిగా ఉంటాయి.
నోరు శుభ్రంగా లేకపోతే శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. పాంక్రియాస్ (క్లోమ గ్రంధి), శ్వాసనాళం కాన్సర్లకూ నోటి ఆరోగ్యానికీ సంబంధం ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
గుండె నాళాల (కార్డియోవాస్క్యులార్) జబ్బులకూ నోటిలోని బాక్టీరియాకు మధ్య లింకు ఉన్నదని తాజా అధ్యయనం ఫలితాలు సూచిస్తున్నాయి. చిగుళ్ల జబ్బుకూ రక్తపోటుకూ మధ్య సంబంధం ఉందని ఒక పరిశోధన సూచించింది. స్ట్రోక్ వచ్చిన తర్వాత చికిత్స పొందుతున్న వారి బ్లడ్ క్లాట్స్లో నోటి బాక్టీరియా కనబడింది.
నోట్లో ఉండే మంచి బాక్టీరియాను నాశనం చేసినా రక్తపోటు ముప్పు పెరుగుతుందని వెల్లడయింది. క్రమం తప్పకుండా పళ్లు శుభ్రం చేసుకోవడం వల్ల గుండె పోటు ముప్పు తగ్గుతుందని తాజాగా ఒక అధ్యయనంలో తెలిసింది. ఈ పరిశోధన ఫలితాలను యూరపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురించారు. రోజుకు మూడు సార్లు పళ్లు శుభ్రం చేసుకునే వారికి హర్ట్ ఫెయిల్యూర్ ముప్పు 12 శాతం తగ్గుతుందని ఆ అధ్యయనంలో బయటపడింది. దీనిపై ఇంకా పరిశోధనలు జరగాల్సిఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.