నారింజ కి ప్రపంచం లో ఎంతో గిరాకీ ఉండడానికి కారణం దానిలో ఉండే విటమిన్లు, లవణాలుఅని చెప్పాలి. విటమిన్ ఏ, బి లు స్వల్పం గా, విటమిన్ – సి ఎక్కువగా ఉంటుంది . చాలు, మనిషికి ఒక రోజుకు కావలసిన ‘సి’ విటమిన్ కోసం ఆరు ఔన్సుల నారింజ రసం త్రాగితేచాలు. వాటిని అలాగే తినటం మంచిది, లేదా రసం తీసి త్రాగటం కూడా మంచిదే.
ఈ పండులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీని లోని కాల్షియం దేహ ధాతువు ల్లో తేలికగా కలసిపోతుంది. తియ్యగా ఉండే నారింజ లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది కాస్త ఎక్కువ శక్తిని ఇస్తుంది. సూర్యరశ్మిలో పండడం వలన , నారింజలో ని పిండి పదార్ధాలు చక్కెరగా మారుతాయి. అందుకే నారింజ తేలికగా జీర్ణమవుతుంది. జ్వరాలలో, జీర్ణశక్తిమందగించినప్పుడు , నారింజను వాడితే, అజీర్ణ వ్యాధి తగ్గిపోతుంది. ఆహారనాళ్ళలో విష క్రిములు చేరకుండా, నారింజ నిర్ములిస్తుంది.
సూర్యుడి నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణా ల ప్రభావం తో చర్మం కమిలిపోయి నల్లగా అవుతుంది. ఐతే నారింజ పండ్లతో ఆ సమస్య ను దూరం చేసుకోవచ్చు. ఒక స్పూన్ నారింజ తొక్క పొడికి చిటికెడు పసుపు,కొంచెం చందనం,కొంచెం తేనె కలిపి పేస్ట్‌లా చేసుకుని దానిని ముఖానికి, చేతులకు పట్టించి 5 నిమిషాల తర్వాత నెమ్మదిగా రుద్దాలి. ఇంకో ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత మంచి నీటి తో కడిగేసుకోవాలి.
ఆరెంజ్ జ్యూస్‌లో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగాఉండడం వలన అది సహజమైన బ్లీచింగ్‌గా పని చేస్తుంది. నారింజ రసాన్ని ఫ్రీజర్‌లో గడ్డకట్టించి ఆ తర్వాత ముఖం పై మృదువుగా మర్దన చేసుకున్నతర్వాత నీటి తో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా ఉంటుంది.నారింజ రసం తో ముఖాన్నిశుభ్రం చేసుకున్న తర్వాత మంచి కంపెనీ కి చెందిన సౌందర్య సాధనాలను మాత్రమేవాడాలి. నారింజ తొక్క లో విటమిన్ సి తోపాటు యాంటీ యాక్సిడెంట్లుపుష్కలంగా ఉంటాయి. అది సహజమైన క్లేన్సర్ గా పనిచేసి చర్మాన్ని నిగురించేలా చేస్తుంది.