Diabetes: డయాబెటీస్ కంట్రోల్ రైస్ ప్రాసెస్.. మామూలుగా చెబితే వినం.. పరిశోధనలు చెబితేనే.!

Share

Diabetes: మన పెద్దలు ఏది చేసినా అది మన మంచికే చేస్తారని తెలుసు.. కానీ వాటిని మనం వాస్తవికంగా నమ్మం.. అదే పరిశోధనలు జరిగి ఇది మంచిదని చెబితే మాత్రం అదే ఫాలో అవుతాం.. సాధారణంగా మన అమ్మమ్మల కాలంలో వాళ్ళు బియ్యం నాన బెట్టి అన్నం ఉడికాక గంచి వార్చి ఆ అన్నాన్ని ఆవిరిపై ఉడికించే వారు.. ఇలా చాలా ఏళ్లుగా మనం తిన్నాం.. ఇప్పుడు అందరూ కుక్కర్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో అన్నం వండుతున్నరు.. ఇప్పుడు ఇందంతా ఎందుకు చెప్పానో మీకు చివరలో అర్థం అవుతుంది..!

Parboiling Rice To Control Diabetes:

ఈరోజుల్లో డయాబెటిస్తో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది.. ప్రతి పది మందిలో ఏడుగురు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.. మధుమేహంతో బాధపడుతున్న వారు తీసుకునే ఆహారం పైన వారి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.. అందుకే వీళ్ళు అన్నం వండుకొని తినే విధానాన్ని యూనివర్సిటీ ఆఫ్ షేఫీల్డ్ శాస్త్రవేత్తలు ఒక పద్ధతిని కనుగొన్నారు.. అదే పార్బాయిలింగ్ రైస్ టెక్నిక్.. పార్బాయిలింగ్ అంటే వెచ్చని నీళ్లతో ను ఆవిరితో ను అన్నం సగం ఉడకబెట్టి దాన్ని నాణ్యతను మెరుగు పరిచే ఒక పద్ధతి.. ఈ పద్ధతి ప్రకారం ముందుగా అన్నం వండే 5 నిమిషాల ముందు బియ్యం బాగా కడిగి పెట్టాలి. ఇది ఆర్సెనిక్ ను తొలగిస్తుంది. ఆ తర్వాత ఆ బియ్యాన్ని 5 నిమిషాల పాటు ఉడికించాలి బియ్యం ఉడికిన తర్వాత గంజి వంచి ఆవిరి మీద ఆ అన్నం స్టవ్ మీద ఉడికించాలి.

Parboiling Rice To Control Diabetes:

ఈ పరిశోధన ప్రకారం ఈ విధంగా బియ్యం వండినట్లయితే బ్రౌన్ రైస్ తింటే 50 శాతం వరకు ఆర్సెనిక్ తొలగిపోతుంది.. అదే వైట్ రైస్ నుండి 74 శాతం వరకు ఆర్సెనిక్ అనేది తొలగించబడుతుంది. PBA సాంకేతికత అన్నం వండడం వల్ల అందులో ఉండే స్టార్చ్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. డయాబెటిక్ పేషంట్స్ కి ఎలాంటి హానీ జరగదు. అలాగే స్టార్చ్ తక్కువగా ఉన్నప్పుడు అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అనేది ఒక్కసారిగా పెరగదు. ఈ అన్నం ఇలా వండుకుని తింటే ఆరోగ్యానికి మంచిదని తాజా వైద్య పరిశోధనలు చెబుతున్నాయి.. ఒకప్పుడు మన బామ్మలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు ఇలాగే వండుకుని తిన్నారు.. ఇప్పుడు అదే సైంటిస్టులు కనిపెట్టి చెబుతున్నారు.. వాళ్ళు అలా అన్నం వండుకుని తినమంటే చాదస్తం అంటాం.. అదే సైంటిస్టులు కనిపెట్టి చెబితే ఫాలో అవుతాం..


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

43 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

46 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago