మీ పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే!!

తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల గౌరవ మర్యాదలతోను, నిజాయితీగా, ఉదార స్వభావంతో వ్యవహరించాలి.ప్రతి తల్లీ, తండ్రీ  పిల్లలకు మంచిఅలవాట్లుచెప్పే సమయంలో చక్కని గైడ్‌లా ప్రవర్తించాలి. పిల్లలు మనం చెప్పినట్టు వినరు,మనం చేసినట్టు చేస్తారు అని గుర్తు పెట్టుకుని ప్రవర్తించాలి.సహజం గానే తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శపూర్వకమైన వ్యక్తులు  గా కనిపించాలి. పిల్లల పెంపకం లో కూడా ఒక మంచి రోల్‌మోడల్‌గా నిలవాలి.

మీ పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే!!

మీ పిల్లలు ఏదైనా కొత్త విషయం నేర్చుకొనేటప్పుడువారికీ  ఒక పాజిటివ్‌ వైఖరిని అందివ్వండి. కొత్త కొత్త  విషయాలను కనుగొనడం, కొత్త నైపుణ్యా లను ప్రదర్శించడం, కొత్తకొత్త ఆలోచనలువచ్చేలాంటి  ఆటలు  అలవాటు చేయండి . నేర్చుకోవడం అంటే వారికి  ఒక సరదా గాఉండేలాచేయండి. తల్లిదండ్రుల మధ్య సత్సంబంధం,ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండటం గమనిస్తూ   పెరిగే పిల్లలు  సహజం గానే ప్రేమపూరిత భావనలను అలవర్చుకుంటారు. అన్యోన్యం లేని దంపతులు  ఎప్పటికి ఉత్తమ తల్లిదండ్రులు  కాలేరు.

ఎంత తీరిక లేకపోయినా కూడా వారికోసం సమయాన్ని వెచ్చించి వారితో కబురులు చెబుతూ వారికీ వచ్చే సందేహాలు తీరుస్తూ కథలు చెప్తూ..స్కూలు,స్నేహితుల కు సంబందించిన విషయాలను తెలుసుకుంటూ వారికీ చదువుకోవడం లో సహాయపడుతూ ఉండాలి.భార్య లేదా భర్త పూర్తిగా ఆ కర్తవ్యని తీసుకునేలా ప్రణాళిక వేసుకోండి.వారితో మీరు ఎక్కువ సమయం గడిపినప్పుడే వారి బలం, బలహీనతలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది అంటున్నారు పిల్లల మానసిక వైద్య నిపుణులు.

పిల్లల్ని ఎప్పుడు విమర్శిస్తూ ఉండకండి. వారి లో ఉండే  అత్యున్నత భావాలకు అది దెబ్బ అవుతుంది . పిల్లలకు మీ దగ్గర  ఉంటే భద్రం గా ఉంటాం అనే  భావనల్ని కల్పించండి. వారి ముందే  గొడవలు పడకండి .తల్లిదండ్రుల గొడవలు పిల్లల మీద తీవ్రప్రభావం చూపుతాయని గుర్తుపెట్టుకోవాలి. చిన్నతనంలో పిల్లల అల్లరి కి హద్దే ఉండదు.మాట కూడా  వినరు.అల్లరి చేయకుండా అస్సలు ఉండలేరు.అలాని వారు చేసిన పనులను చూస్తూ ఊరుకోలేము. ఇలాంటి పిల్లలను మన దారిలోకి తెచ్చుకోవాలంటే వారిని ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకుని నేర్చుకునేలా ప్రోత్సహించండి.పిల్లలకు ఏమి తోచకపొతే నే బాగా అల్లరి చేసి పేచీలు పెడుతూ ఉంటారు.

అందువల్ల వారికీ కొత్తకొత్త వ్యాపకాలు కలిపించండి. ఎలా అయితే చదువులో మంచి మార్కులు తెచ్చుకుంటేబహుమతి ఇస్తామని చెప్తామో  అలాగే అల్లరిచేయకుండా బుద్ధిగా ఉంటే, బహుమతులు ఇస్తామంటూ వారిని ప్రోత్సహించాలి .. ఇలా చేయడం వల్ల ఎలా మెలగాలో వారు తెలుసుకుంటారు. పిల్లలు ఏదైనా  కావాలని మారం చేస్తుంటే, అది ఎందుకోసమో దాని అవసరం  వారికి ఎంతుందో గమనించండి.. వారు దానికోసం వాదించడం కరెక్టేనా.. కాదో తెలుసుకుని వారితో ఏకీభవించండి..పిల్లల తో ఎప్పుడూకఠినంగా కాకుండా వారితో స్నేహంగా కూడాఉండండి.వారు మీతో ఏ విషయాన్నైనా పంచుకునేవిధంగా వారిని మలుచుకోండి.

వారి ఇష్టాయిష్టాలను తెలుసుకుని సలహాలు, సూచనలు ఇవ్వండి.వారికీ ఏమైనా పనులు చెబితే వాటిని కొత్తగా ఎలా చేయొచ్చో, వాటి వల్ల ఏయే ఉపయోగాలున్నాయో చెప్పండి.. వీటి వల్ల వారు సరికొత్త విషయం నేర్చుకున్నామన్న ఉత్సాహంతో ఆ పనిని కాదనకుండా చేసేస్తారు. ప్రేమతో వారిని సాకి మంచి ,చెడు వివరిస్తే వారు మంచి వ్యక్తులుగా తయారవుతారు. పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు ఇలా చేయండి బాగా పిల్లల అల్లరిని ఏవిధంగా మలచండి