Diet: పరోటా – చపాతీ ఈ రెండిట్లో ఏది తింటే తేలికగా బరువు తగ్గచ్చు

Share

Diet: చాలా మంది బరువు తగ్గడానికి రోటి, పరాటాల  లో ఏది మంచిది అని  తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు . అయితే   మనం   బరువు  తగ్గడానికి ఈ రెండిటిలో ఏది మంచిది అని తెలుసుకుందాం. అయితే మనం ఏం తిన్నామన్నది కాదు..   తిన్నదాని లో  కేలరీలు బట్టి మన బరువు ఉంటుంది అని తెలుసుకోవాలి. ఎక్కువ క్యాలరీలు ఉండే పరాటాలు తినడం వలన  బరువు తగ్గాలనుకునేవాళ్ల కి   సమస్య గా మారుతుంది.  కేలరీలు తక్కువగా ఉండే రోటి  తినడం వల్ల   బరువు తేలికగాతగ్గవచ్చు.

 

షుగర్ సమస్య ఉన్న  వాళ్ళు పరోటా  కి దూరం గా ఉండాలి. నెయ్యి తో చేసిన, కాల్చిన వాటిని షుగర్  పేషెంట్లకు  ఇవ్వడం మంచిది కాదు. ఇది బ్లడ్ షుగర్  స్థాయి పెరిగేలా చేస్తుంది  కాబట్టి షుగర్  పేషెంట్లకు రోటి  పెట్టడం  మంచిది. అందులో నెయ్యి అనేది వెయ్యకూడదు.జొన్నలు, రాగులు, బాదం, ఓట్స్ మొదలైన వాటితో మీరు రోటీ లేదా పరోటా   ఆరోగ్యంగా కూడా   చేసుకుని  తీసుకోవాలి.  ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.ఆరు ఇంచుల  గోధుమ  రొట్టెలో  కార్బోహైడ్రేట్ 15 గ్రాములు , ప్రోటీన్ 3 గ్రాములు , కేలరీలు 70  వరకు ఉంటాయి.  ఆరు ఇంచుల పరాటా లో  క్యాలరీలు 126 ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడానికి ఏది మంచిదో మనకి క్లియర్ గా తెలుస్తుంది.  కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు  పరాటాలు పక్కన పెట్టి గోధుమ రొట్టెలు తినడం మంచిది.

 

చాలా మంది అన్నానికి బదులుగా చపాతీ తింటుంటారు. అయితే ఇక్కడ  తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బరువు తగ్గడానికి అన్నానికి బదులుగా చపాతీ  తీసుకోవడం కరెక్ట్ . అయితే వాటిని ఎంత మోతాదులో  తీసుకుంటున్నారు అనేది  చాలా ముఖ్యం అని గమనించాలి. చపాతీలు ఎక్కువగా కూడా తీసుకోకూడదు. బరువు తగ్గటానికి రోజుకి   నాలుగు చపాతీలు మాత్రం చాలు .. అంతకన్నా ఎక్కువ తింటే మీకు అది అన్నం తో సమానం అయిపోతుంది అని గుర్తు పెట్టుకోవాలి.


Share

Related posts

అన్నం ఇలా తింటే బరువు తగ్గొచ్చు..!!

bharani jella

షుగర్ ఉన్నవాళ్ళు ఇది తినకూడదు అంటారు .. వాళ్లకేమో ఇది అంటే ప్రాణం ..  నిజానిజాలు ఏంటో !

Kumar

రక్తహీనత, ఊబకాయానికి చక్కటి పరిష్కార మార్గం ఇదే..!

Teja