కండోమ్ వాడటం సురక్షితమేనా.. అసలు కండోమ్ ని దేనితో తయారు చేస్తారో తెలుసా?
కండోమ్ గురించి మనంఎదోఒక సందర్భం లో వింటూనే ఉంటాము. కానీ అది ఎ మెటీరియల్ తో తయారవుతుందో చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. కండోమ్ వాడటం సురక్షితమా కాదా అనే అనుమానం కొందరిలో కలుగుతూనే ఉంటుంది.సురక్షితమైన శృంగారం కోసం వాడే కండోమ్ అవాంఛిత గర్భాలను నిరోధిస్తుంది.
అనేకమైన కారణాల చేత పెళ్లయిన వారు కొన్ని రోజుల పాటు పిల్లలను కావాలనుకోరు. అప్పుడు వారికి బాగా సురక్షితంగా ఉపయోగపడేది కండోమ్ మాత్రమే అని చెప్పవచ్చు. కొందరు పురుషులు లైంగిక వాంఛను తీర్చుకోవడానికి అపరిచిత మహిళలతో శృంగారంలో చేస్తారు. అటువంటి వారు సుఖ వ్యాధులు సోకకుండా ఉండేందుకు కండోమ్స్ఉపయోగిస్తారు. ఒకవేళ వాళ్ళు అజాగ్రత్తతో ఉండి కండోమ్స్ వాడకపోతే హెచ్ఐవి వంటి ప్రాణాంతక వ్యాధులు సోకుతాయి. కండోమ్ సరిగా వినియోగిస్తే శృంగార వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు.
ప్రభుత్వాలే కండోమ్ వాడటం ఎంత ముఖ్యమో ప్రకటనల ద్వారా ప్రతి ఒక్కరికీ తెలియచేస్తున్నారు . కండోమ్స్వాడడం వలన 97 నుండి 98 శాతం సురక్షితమని పరిశోధకులు సూచిస్తున్నారు. కండోమ్ తయారు చేసిన తర్వాత నాలుగు సంవత్సరాలపాటు ఎప్పుడైన వాడుకోవచ్చు. 4 సంవత్సరాల తర్వాత వాడితే కండోమ్స్ సుఖ వ్యాధుల నుండి అవాంచిత గర్భం నుండి రక్షణ ఇవ్వలేదు . గతంలో అన్ని కండోమ్స్ జంతువుల మూత్రాశయాలను ఉపయోగించి తయారుచేసినవేనట. 1640 సంవత్సరంలో లండన్ లో మొట్టమొదటి కండోమ్ ని తయారు చేశారట. చనిపోయిన పంది పేగుల నుండి తయారుచేయబడిన కండోమ్ ని వేడి పాలతో శుభ్రం చేసి వినియోగదారులకు ఇన్ఫెక్షన్స్ వంటివి రాకుండా జాగ్రత్త పడేవారట .
ఈజిప్షియన్ దేశస్తులు కండోమ్ తయారీలో మేకలు, గొర్రెలు, పందులు మూత్రాశయాలను కూడా ఉపయోగించేవారట. పారిశ్రామిక విప్లవం తర్వాత 1920వ సంవత్సరంలో జంతువుల నుండి కాకుండా రబ్బరు చెట్లనుండి కండోమ్స్ తయారు చేయడం మొదలు పెట్టారు. 1932లో డ్యూరెక్స్ అనే లండన్ కంపెనీ లక్షల సంఖ్యలో రబ్బరు కండోమ్స్ అమ్మి సంచలనం సృష్టించింది. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కండోమ్స్ తయారీలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అన్ని రకాల కండోమ్స్ ఫ్లేవర్స్ లలో దొరకడం విశేషం అనే చెప్పాలి. కాబట్టి అంత సురక్షిత కండోమ్స్ ని వాడడం ఎలాంటి పరిస్థితులలో కూడా మర్చిపోవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు .