NewsOrbit
హెల్త్

రక్త హీనతతో బాధ పడుతున్నారా? ఇది మీకోసమే!!

రక్త హీనతతో బాధ పడుతున్నారా?ఇది మీకోసమే!!

నేడు ఎంతోమంది రక్తహీనతతో బాధపడుతున్నారు.  200 కోట్ల మంది, అంటే ప్రపంచ జనాభాలో దాదాపు 30 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు అని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (WHO) ఇచ్చిన నివేదిక తెలియచేస్తుంది . పేద దేశాల్లో దాదాపు  40 శాతం మంది పసి పిల్లలు,50 శాతం మంది గర్భిణీలు, ఈ సమస్య ను ఎదురుకుంటున్నారు. రక్తహీనతకు కారణాల గురించి ఆలోచిస్తే అనేకఅంశాలు ఉంటాయి.  ఉప్పు, పులుపు, అధికంగా తీసుకోవడం, మధ్యాహ్నం  నిద్ర లేదా అతి నిద్ర, అజీర్ణం, మలబద్దకం, స్త్రీలకు  రుతు సమస్యలు వంటి అనేక కారణాల వల్ల రక్త హీనత రావొచ్చు.

రక్త హీనతతో బాధ పడుతున్నారా?ఇది మీకోసమే!!

కళ్లుతిరగటం,   కంటి చుట్టూ నల్లటి వలయాలు,కళ్ళు పాలిపోయినట్లు ఉండటం, చూపు మందగించడం, తల తిరుగుతున్నట్లు ఉండటం,  తలనొప్పి, చీటికీ మాటికి జలుబు, గుండె పెరగడం,  గుండెదడ, గుండె వేగంగా కొట్టుకోవడం, త్వరగా అలసిపోవడం, కొంచెం దూరం  నడిచే సరికి ఆయాసం, శ్రమఏమి పడక పోయిన నీరసం రావడం, బలహీనత, తీవ్రమైన అలసట,ఏ పని చేయాలన్న శరీరం సహకరించదు, ఒళ్లంతా నీరు చేరడం, కాళ్లు చేతులు తిమ్మిర్లు, ముఖం, చర్మం పాలిపోవడం, శరీరం లో విపరీతం గా నీటి శాతం పెరిగిపోవడం,నాలుక, పెదాలు పాలిపోయి, చేతి వేళ్లు, తెల్లగా కనిపించడం, నాలుకపై తెల్లని మచ్చలు, చిగుళ్లువాపు, తరచూ ఇన్ఫక్షన్ లు రావడం మొదలైన లక్షణాలు ఉంటాయి.

ఈ లక్షణాలు కనబడినప్పుడు వీలైనంత త్వరగా డాక్టరును సంప్రదించి సలహాలు సూచనలు తీసుకుంటూ తగిన చికిత్స తీసుకోవాలి. సాధ్యమైనంతవరకు నిత్యం ఆహారం లో ఉప్పు ను తగ్గించుకుని తినడంచాల మంచిది. రక్త హీనత సమస్య కు మన ఇంట్లో ఉండే  సహజ పదార్థా లే  ఔషధా లు గా కూడా పని చేస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆహారం లో రోజూ ఏదో ఒక విధంగా తేనెను తీసుకోవాలి. ఇందులో ఉండే ఐరన్ శరీరం లో రక్తా న్ని తయారు చేస్తుంది.యాపిల్ పండు రసం తీసుకుని  అదే మోతాదు లోఒక కప్పు బీట్‌రూట్ రసం, రెండింటి నీ కలిపి తాగాలి. రోజూ ఈ రసం తీసుకుంటే త్వరలో నే  రక్త హీనత తగ్గుముఖం పడుతుంది. రెండు టీ స్పూన్ల  తేనెతో బాగా పండిన అరటి పండును కలిపి తినాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే రక్త హీనత తగ్గుతుంది.

యాపిల్ ,టమాటా, పండ్ల రసాలను కలిపి రోజూ తీసుకున్న రక్తహీనతను తగ్గించుకోవచ్చు. మనం రోజూ తీసుకు నే ఆహారం లో బెల్లంతో తయారుచేసిన వేరు శెనగ ఉండలు,  రాగులు, బెల్లం, రాగి ముద్ద, సజ్జలు, యాపిల్‌, నల్లద్రాక్ష పళ్లు,బాదం, సపోటా, మామిడి, ఫిగ్‌, ఖర్జూరం, సీతాఫలం, చెర్రి స్రాటబెర్రీ, రాస్పబెర్రీ, కిస్మిస్‌,  బీట్‌రూట్‌, బీన్స్‌,బొప్పాయి, పుచ్చకాయ,  దంపుడు బియ్యం,దంపుడు అటుకులు, నల్లనువ్వుల నూనె, పాలు, బ్రెడ్‌, తేనె, మొలకెత్తి న పెసలు, శెనగలు, ఆప్రికాట్‌, ఈతపండ్లు, రాజ్మా, మటన్‌, కిడ్నీ, చికెన్‌, కార్జం నత్తలు,మునగాకు,  కొన్ని రకాల చేపలు, ఉల్లికాడలు, తోటకూర, తాజా ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి గోధుమ గడ్డిరసం లేక గోధుమగడ్డి పౌడరు. వీటితోపాటు సి విటమిన్‌ ఉండే  నిమ్మ ఉసిరి, బత్తాయి, నారింజ తీసుకుంటే శరీరమునకు కావలిసిన ఇనుము అందుతుంది.

Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri