హెమోరాయిడ్స్తో బాధపడుతున్న వ్యక్తులు పాయువులో నొప్పి, చికాకు, దురద మరియు అసౌకర్యాన్ని అనుభవిస్తారు. మలబద్ధకం నొప్పిలేకుండా రక్తస్రావం కలిగిస్తుంది. ఇటువంటి హెమోరాయిడ్లను సరైన చికిత్స ద్వారా పరిష్కరించవచ్చు. విచ్ హ్యజెల్లో నేచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలవు. కాబట్టి, ఇది వాపును తగ్గిస్తుంది.
పైల్స్ ను ట్రీట్ చేయడానికి ఎన్నో ఏళ్లుగా అలోవెరా జెల్ అనేది వాడుకలో ఉంది.అలోవెరా మొక్కనుంచి తాజాగా తీసుకున్న జెల్ ఐతే మరీ మంచిది. హార్వర్డ్ హెల్త్ ప్రకారం ప్రతి బవుల్ మూవ్మెంట్ తరువాత 20 నిమిషాలపాటు వార్మ్ బాత్ తీసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుందట. బాత్ వాటర్ లో ఎప్సమ్ సాల్ట్ ను కలిపితే నొప్పి తగ్గి మరింత రిలీఫ్ లభిస్తుందట. హైడ్రోకార్టిసోన్ క్రీమ్ ను మీరు వాడేటట్లయితే వారానికి మించి ఈ క్రీమ్ ను వాడకూడదని గమనించండి.
బవుల్ మూవ్మెంట్ తరువాత టిష్యూ పేపర్ ను వాడితే సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి, వైప్స్ తో క్లీన్ చేసుకుంటే ఇరిటేషన్ పెరిగే ప్రమాదం తగ్గుతుంది. ఐస్ ప్యాక్స్ లేదా కోల్డ్ కంప్రెస్ ను 15 మినిట్స్ వరకు అప్లై చేయడం వల్ల ఏనస్ వాపును తగ్గిస్తాయి. పెద్దవి ఐన పెయిన్ఫుల్ హెమరాయిడ్స్ ను తగ్గించేందుకు ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఐస్ ను నేరుగా చర్మంపై అప్లై చేయకూడదు. అందుకే, ఐస్ ను పేపర్ టవల్ లో గానీ లేదా క్లాత్ లో గానీ చుట్టి వాడాలి.”నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డీసీజెస్” ప్రకారం ఫైబర్ సప్లిమెంట్స్ గాని లేదా స్టూల్ సాఫ్టనర్స్ గాని కాన్స్టిపేషన్ సమస్యను తగ్గిస్తాయి.
లూజ్ గా ఉన్న కంఫర్టబుల్ కాటన్ బట్టలకే ప్రయారిటీ ఇవ్వాలి. ముఖ్యంగా అండర్వేర్ విషయంలో మరింత కేర్ అవసరం. దాంతో, ఏనల్ ప్రాంతం శుభ్రంగా అలాగే డ్రైగా ఉంటుంది. పైల్స్ లక్షణాలు తగ్గుతాయి. పెర్ఫ్యూమ్ డిటర్జంట్స్ అలాగే ఫ్యాబ్రిక్ సాఫ్టనర్స్ ను వాడటం తగ్గించండి.లైఫ్ స్టయిల్ అలాగే డైటరీ ఛేంజెస్ అనేవి పైల్స్ నుతగ్గించడానికి మంచి మార్గాలు. ఫిజికల్ గా యాక్టివ్ గా ఉంటూ ఆరోగ్యంగా తినాలి. దాంతో, బవుల్ మూవ్మెంట్స్ రెగ్యులర్ అవుతాయి.
హై ఫైబర్ ఫుడ్స్ ను ఎక్కువగా తినాలి. ఎక్కువ నీళ్లను తాగాలి. డైజెస్టివ్ ప్రాసెస్ ను ఇంప్రూవ్ చేసుకోవాలి. కాన్స్టిపేషన్ ను తగ్గించుకోవాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అవసరం. ఎక్కువసేపు కూర్చుని ఉండటం ఆరోగ్యకరం కాదు. బాత్ రూమ్ కు వెళ్లాల్సిన పరిస్థితి రాగానే వెంటనే బాత్ రూమ్ కు వెళ్ళాలి. పోస్ట్ పోన్ చేయకూడదు. అలా చేస్తే అసౌకర్యం ఏర్పడుతుంది.హెమరాయిడ్స్ ను సులభంగా ట్రీట్ చేయవచ్చు.
కొన్ని అరుదైన కేసెస్ లో మాత్రమే హెమరాయిడ్స్ అనేవి కాంప్లికేషన్స్ ను తెస్తుంది.హెమరాయిడ్ వల్ల కలిగే బ్లడ్ లాస్ అనీమియాకు దారితీస్తుంది. రెడ్ బ్లడ్ సెల్స్ షార్టేజ్ వస్తుంది. ఒకవేళ హోమ్ ట్రీట్మెంట్ అంత ఎఫెక్టివ్ గా లేకపోతే, రెండువారాలు దాటినా కూడా సమస్య తగ్గకపోతే వైద్యున్ని సంప్రదించండి. వారు మిమ్మల్ని డయాగ్నైజ్ చేసి తగిన సూచనలు ఇస్తారు. సమస్య తీవ్రంగా మారితే పైల్స్ ను తొలగించే సర్జరీని సూచిస్తారు. రెక్టార్ బ్లీడింగ్ కనిపించిన వెంటనే డాక్టర్ ను సంప్రదించడం ముఖ్యం.