మన పెద్దలు ఇంటిలో ఆడపిల్ల కడుపుతో ఉంటే ఎలాంటి ఒత్తిడి ఆందోళన లేకుండా చూసుకోవాలని ,గర్భిణీ మంచి మాటలు మంచి వాతావరణంలో గడపాలని అలా గడిపిన వారికీ చక్కని ఆరోగ్య వంతమైన బిడ్డ పుడుతుందని చెప్తూ ఉంటారు. అవన్నీ మూఢ నమ్మకాలూ అని కొట్టిపారేసేవారికి ఇప్పటి పరిశోధనలు చుస్తే ఆశ్చర్యం కలగక మానదు … అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం … మీ బిడ్డ కి నిద్ర సరిగ్గా పట్టకపోయిన నిద్రపోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నా.. కడుపునిండా పాలు తాగి కూడాపడుకోడానికి కష్టపడుతున్న … దానికి కారణం మీరే … అది ఎలా అని ఆలోచిస్తున్నారా?
బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి నిరాశకు గురైతే ఆ ప్రభావం పుట్టిన పిల్లల పై తప్పకుండ ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. తాజాగా చేపట్టిన సర్వే లో ఈ విషయం స్పష్టమైంది. గర్భందాల్చిన తర్వాత మూడు నుండి ఏడు నెలల కాలం చాలాముఖ్యమైనది విలువైనది కూడా. ఈ సమయంలో తల్లి యొక్క మానసిక స్థితి, ఆనందం, ఆమె ఆలోచన లు పిల్లల పై ప్రభావాన్ని చూపిస్తాయి.బిడ్డల ఆరోగ్యాన్ని కి కూడాకారణమవుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో తల్లి ఎంత ఆనందం గా గడిపింది అనేవిషయం, బిడ్డ నిద్ర పోయే సమయాన్నిబట్టి తెలుస్తుందట.
ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా ఆనందంగా, ప్రశాంతం గా గడిపిన తల్లులకు పుట్టిన పిల్లలు, మిగిలిన వారితో పోలిస్తేప్రశాంతం గా హాయిగా నిద్ర పోతున్నారట.అనేక ఆలోచనలతో సతమతమవుతూ మానసికంగా క్రుంగిపో యి నిరాశ తో ఉన్న తల్లికి పుట్టే పిల్లలు నిద్రలేమి తో బాధపడుతున్నారు. అయితే తల్లి కాబోతున్నప్పుడు స్త్రీ ల ల్లో అనేక రకాల భయాలు ఆలోచన లూ, మొదలవుతాయి. వీటిని తట్టుకుని మాతృత్వా న్ని పొందుతున్నందుకు సంతోషపడేలా చేయాల్సిన బాధ్యత పూర్తి గా వారి భర్త, కుటుంబ సభ్యులపైనే ఉంది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని ఆత్మ స్థైర్యం పెంచుతూ, ఒత్తిడి ని దూరం చేయడానికి అండగా నిల్వవలిసి ఉంటుంది.
అలా కాకుండా గర్భిణీ అని కూడా లేకుండా , ఆమె ని తిట్టి నా అవమానించినా, చులకన చేసి మాట్లాడి బాధ పెట్టిన మానసిక క్షోభ కి గురి చేసిన ఆ ప్రభావం బిడ్డ మానసిక పరిస్థితి పై నూటికి నూరు శాతం ఉంటుందని ఈ అధ్యయనంలోనిరూపించబడింది. అంతేకాకుండా కడుపుతో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం పట్ల కూడా చాలా శ్రద్ధ చూపించాలని హెచ్చరిస్తున్నారు వైద్యులు. లేకపోతే పుట్ట బోయే పిల్లల పై ఆ ప్రభావం చాలారోజుల పాటు ఉంటుంది. అమెరికాలో 833 మంది పిల్లల పై చేసిన సర్వే లో ఈ నిజాలు బయట పడ్డాయి. వీరంతా ఆరేళ్లలోపు పిల్లలే… పిల్లల నిద్రపోయే సమయం, వారి తల్లులు గర్భంతో ఉన్నప్పడు మానసిక స్థితి ఆధారంగా ఓ డేటా రూపొందించారు .
ఇందులో గర్భవతి అయిన స్త్రీ మానసిక స్థితి, పుట్ట బోయే బిడ్డ ఆరోగ్యం పై ఏ విధం గా ప్రభావం చూపిస్తుందో స్పష్టంగా నిర్ధారణ అయ్యిందిరుజువయింది . బిడ్డ లో కలిగే నిద్రలేమి కి కారణం తల్లి మానసిక ప్రవర్తనేకరణం . కాబట్టి మీ బిడ్డ బాగుండాలని కోరుకున్నవారైతే మీకు కలుగుతున్న ఆందోళనలు ప్రయత్న పూర్వకం గా పోగొట్టుకుని ప్రశాంతతని కలిపించుకుంటేనే మీకు ఆరోగ్య వంతమైన బిడ్డలు పుడతారు .పుట్టబోయే బిడ్డ కోసం