కరోనా వైరస్ లక్షణాలను తరిమికొట్టే అద్భుతమైన రసం ఇదే!

Share

ప్రస్తుతం కరోనా భయంతో చాలామంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ కి వెళ్లడానికి భయపడుతున్నారు. ఒకవేళ వెళ్లిన కరోనా ఎక్కడ సోకుతుందో అని ఆరోగ్య సమస్యను అలాగే నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ నిజానికి ఏదైనా సమస్య కోసం హాస్పిటల్ కి వెళితే కరోనా అంటించుకునే వస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఇంట్లోనే ఉండి ఇంటి చిట్కాలతో దగ్గు, జలుబు వంటి వాటిని దూరం చేసుకుంటున్నారు. కాబట్టి దగ్గు, జలుబు సమస్యలతో బాధపడేవారు, మిరియాల రసం తాగితే ఈ సమస్య నుండి ఉపశమనం పొందుతారు.

మిరియాలు మన ఆరోగ్యానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా మిరియాల పాలు తాగితే ఆరోగ్యం విషయంలో సమస్యలు ఉండవు. మిరియాల రసంతో కూడా జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరం చేసుకోవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. మిరియాల రసం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి కరోనా వైరస్ లక్షణాలను తరిమికొడుతుందని అంటున్నారు ఆరోగ్యనిపుణులు. కాబట్టి ఈ మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం!

కావలసిన పదార్థాలు..

రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు,

ఒక కప్పు కొబ్బరి పొడి,

రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు,

2 ఎండు మిర్చి,

2 టేబుల్ స్పూన్ల నెయ్యి,

1/2 టీ స్పూన్ ఆవాలు,

కరివేపాకు,

సరిపడు ఇంగువ,

సరిపడా ఉప్పు ,

కావాల్సినన్ని నీళ్లు.

తయారీ విధానం..

ముందుగా ఒక పాత్రలో నెయ్యి వేసి, వేడి చేసి అందులో మినప్పప్పు, మిరియాలు, కొబ్బరి పొడి వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని పొడి చేసి పక్కన ఉంచాలి. తర్వాత అదే పాత్రలో కొంచెం నెయ్యి వేసి, ఆవాలు,ఇంగువ, కరివేపాకు,ఎండుమిర్చి వేసి పోపు చేయాలి. ఇప్పుడు మనం ముందుగా పొడి చేసుకున్న మిరియాల పొడిను, పోపు చేసిన దానిలో వేసి కలపండి, ఇప్పుడు అందులో నీళ్ళు పోసి బాగా ఉడికించాలి, ఇప్పుడు అందులోనే సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే మిరియాల రసం రెడీ. ఇక ఈ రసంను వేడి అన్నంలో తీసుకుంటే కరోనా లక్షణాలు అయినా జలుబు, దగ్గు పరార్ అవుతాయ్.


Share

Related posts

‘ఎల్ఆర్ఎస్’పై కాస్త వెనక్కుతగ్గిన కేసిఆర్..కీలక ఆదేశాలు జారీ..!!

somaraju sharma

ఇది స్టాండప్ కామెడీలా లేదు.. భార్య బాధితుల సంఘంలా ఉంది.. నాగబాబుకు పంచ్ వేసిన కంటెస్టెంట్?

Varun G

 స్త్రీ ,పురుషులు ఇద్దరు అందుబాటులో  ఉండే  దీన్ని తింటే ఆ విషయం  లో  మీకు తిరుగే లేదు …

Kumar