మీరు డిప్రెషన్ లో ఉన్నారా? పెర్ఫ్యూమ్ వాడుతున్నారా? అయితే ఇది తెలుసుకుని ప్రమాదం నుండి బయటపడండి!!

నలుగురిలోకి వెళ్లవలిసివచ్చినప్పుడు లేదా ప్రత్యేక సందర్భాల్లో గుప్పున  సువాసనలు వెదజల్లే సెంట్‌ని పెర్ఫ్యూమ్స్‌, చాలా మంది వాడుతుంటారు.ముఖ్యంగా స్త్రీలు లు శుభకార్యాల సమయంలో ఎక్కువగా వాడుతుంటారు. అయితే వీటి వల్ల లాభం మాట ఎలా ఉన్ననష్టమే ఎక్కువ అంటున్నారు ఆరోగ్య నిపుణులు… వీటి వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.రసాయనాలతో తయారైన  పెర్ఫ్యూమ్స్‌,సెంట్‌, ని వాడటం వల్ల అర్యోగం పాడవుతుంది తెలుపుతున్నారు.రక రకాల పువ్వుల సువాసనలతో తయారుచేస్తున్నట్లు చెప్పే కంపెనీలు. వాటిలో కలుపుతున్న ప్రమాదకర రసాయనాల గురించి  మాత్రం బయటపెట్టవంటున్నారు ఆరోగ్య నిపుణులు.పెర్ఫ్యూమ్స్‌ వాడే వారిలో 2శాతం మంది విష ప్రభావాల కు గురవుతున్నారు.

మీరు డిప్రెషన్ లో ఉన్నారా? పెర్ఫ్యూమ్ వాడుతున్నారా? అయితే ఇది తెలుసుకుని ప్రమాదం నుండి బయటపడండి!!

వీటిని ఎక్కువగా వాడడం వల్ల చర్మ సమస్యలు ఎదురుకోక  తప్పడం లేదు.కొందరికి సెంట్లు, పెర్ఫ్యూమ్స్ వల్ల గాయాలు కూడా అవుతున్నాయని శాస్త్రవేత్తలు గమనించారు. అధికంగా పెర్ఫ్యూమ్స్, సెంట్ వాడడం వల్ల డిప్రెషన్ సమస్య పెరగడమే కాదు, అది నానాటికీ ఎక్కువైపోయి వైద్యానికి కూడా అందనంత స్థాయికి చేరిపోతుంది అంటు హెచ్చరిస్తున్నారు  పరిశోధకులు.

కాబట్టి సాధ్యమైనంత వరకు సెంట్లు, పెర్ఫ్యూమ్స్‌ వాడకాని కి దూరంగా ఉండడం మంచిదంటున్నారు. ఎలాంటి హాని కలిగించని కొన్ని సుగంధ ద్రవ్యాలు మన పురాతన కాలం  నుండి మనకి అందు బాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని తెలుకుందాం… కొంచెం బాదం నూనె తీసుకుని కొన్ని చుక్కల సుగంధ తైలం ను కలిపి ఒక మిశ్రమం గా చేసుకుని చర్మానికి వాడటం వలన మంచి వాసనను వెదజల్లుతుంది. దీని వాడకం వలన ఎలాంటి దుష్ప్రభావాలు కూడా కలగవు. పైగా సుగంధ తైలాలు చాల రకాలు మనకు మార్కెట్ లో లభ్యమవుతాయి. వాటితో పాటు కస్తూరి, జవ్వాది లాంటి  సుగంధ ద్రవ్యాలు కూడా మార్కెట్లో సులభం గా దొరుకుతాయి. వీటివలన  చర్మానికి ఎలాంటి సమస్య రాదు. ఇవి రాసుకున్న చాల సేపటివరకు మంచి సువాసన వస్తూనే ఉంటుంది.. చెమట పట్టినకూడా దీనివాసన రెట్టింపు అవుతుంది. కాబట్టి చర్మనికి హాని చేసే వాటిని పక్కన పెట్టి ఇలాంటివి వాడడానికి ప్రయత్నం చేస్తే అన్నివిధాలా మంచిది..