పిల్లలకు డబ్బాలో పాలు పడుతున్నారా ?అయితే అవి పాలు కాదు విషం అంటున్నారు శాస్త్రవేత్తలు!

అప్పుడే పుట్టిన పసి బిడ్డలకు తల్లి పాల ను మించిన అమృతం మరొకటి లేదని చెప్పాలి. తల్లి చనుబాలు పట్టడం వలన  బిడ్డకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఇది బిడ్డకు మాత్రమే కాదు తల్లికి కూడా మంచి ఆరోగ్యాన్ని కలుగచేస్తుంది. అయితే కారణాలు ఏమైనప్పటికి కొందరు తల్లులు బిడ్డలకు తమ పాలు బదులు.. డబ్బా పాలు పడుతున్నారు. ఇలా చేయడం ద్వారా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోవడమే కాదు ఆరోగ్యాన్ని కూడా పాడుచేసుకుంటున్నారు.

పిల్లలకు డబ్బాలో పాలు పడుతున్నారా ?అయితే అవి పాలు కాదు విషం అంటున్నారు శాస్త్రవేత్తలు!

అయితే కొన్నిపరిస్థితులలో  తల్లి ఆరోగ్య సమస్యల వల్ల బిడ్డకు పాలు ఇవ్వలేకపోవడంఅనేది ఏమి చేయలేని విషయం.డబ్బా పాలు తాగించడం వలన పిల్లలు రోజుకు మిలయన్ల కొద్ది మైక్రోపాస్టిక్‌ను మింగేస్తున్నారని తాజా పరిశోధన లో తేలింది. ప్రపంచంలో చాలా వరకు బాటిల్స్‌ను పాలీప్రోపైలీన్ పాస్టిక్‌తో తయారు చేసినవే అందరికి అందుబాటులో ఉండడం వలన అవే వాడుతున్నారు. ఆహారానికి సంబంధించి వాడే ప్లాస్టిక్‌లో 82 శాతం ఈ రకానికి సంబంధించినవే.

ఐర్లాండ్‌ఉన్న  ట్రినిటీ కాలేజ్ నిర్వహించిన ఈ అధ్యయనం నేచర్ ఫుడ్ జర్నల్‌లోప్రచురించబడింది. బాగా వేడి గా ఉన్న పాలను డబ్బా ల్లో పోయడం, వేడి నీటితో  వాటిని శుభ్రపరచడం వల్ల మైక్రోప్లాస్టిక్‌లు విడుదలయ్యే అవకాశం ఉందని ఆ అధ్యయనం తెలిపింది. చాల  రకాల జాగ్రత్తలు తీసుకోవడం వలన మాత్రమే పిల్లలు మైక్రోప్లాస్టిక్‌కు దూరంగా ఉండేలా చేయగలము. బాటిల్స్ శుభ్రపరిచేందకు వాడే నీటిని ప్లాస్టిక్ పాత్రలో కాకుండా ఇతర లోహాలతో చేసినపాత్రలలో వేడి చేయాలి. నీటిని బాగా వేడిచేసి న తర్వాత గది ఉష్ణోగ్రత కు వచ్చే  వరకు చలార్చిన తర్వాత మాత్రమే బాటిల్స్‌ను శుభ్రం చేయాలి.

కనీసం మూడు సార్లు బాటిల్స్‌నుశుభ్రం చేయాలి . అలాగే బాటిల్స్ శుభ్రపరిచే సమయంలో ఎక్కువగా కుదపక పోవడం మంచిది.12 నెలల వయస్సు గల చిన్నారులపై  మైక్రో ప్లాస్టిక్స్ ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి అనే విషయాన్ని  పరిశోధకులు అంచనా వేశారు. ఇందుకోసం 48 దేశాల్లోని చిన్నారులను పరిశీలించిన  వారు మైక్రోప్లాస్టిక్స్ పిల్లల శరీరం లోకి విషపూరిత కెమికల్స్ చేర్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.కాబట్టి ప్లాస్టిక్ వాడకుండా ఉండేందుకు జాగ్రత్త లు తీసుకోవడమే మంచిది.