Diabetes: మధుమేహం వినడానికి తియ్యగా ఉన్న ఈ అనారోగ్య సమస్య బారిన పడితే జీవితాంతం మందులు వేసుకోవాల్సిందే.. మన రక్తంలో చక్కెర స్థాయిల హెచ్చుతగ్గుల కారణంగా డయాబెటిస్ వస్తుంది.. షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుకొకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.. డయాబెటిక్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచడానికి ఈ జ్యూస్ ఒక్క గ్లాస్ తాగమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..!

ఒక గ్లాసు దానిమ్మ పండ్ల రసాన్ని తాగితే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ సర్వేలో పాల్గొన్న డయాబెటిక్ రోగులకు రెండు వారిని రెండు గ్రూపులుగా విడగొట్టారు. ఒక గ్రూపులో 230ML పంచదార నీళ్లు, మరో గ్రూపులో 230ML దానిమ్మ జ్యూస్ ను ఇచ్చారు. దానిమ్మ జ్యూస్ తాగిన వారి శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గడం వారు గమనించారు. అంతేకాకుండా దానిమ్మ జ్యూస్ 15 నిమిషాలలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించ వచ్చని వారు కనుగొన్నారు. అదే పంచదార నీళ్లు తాగిన వారిలో షుగర్ లెవెల్స్ లో ఎటువంటి మార్పు కనిపించలేదు.

దానిమ్మ కాయలు అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటిస్ కారణంగా కలిగే వ్యాధులతో పోరాడుతాయి. ఫ్రీరాడికల్స్ వలన కలిగే వ్యాధులను రాకుండా అడ్డుకుంటాయి. దానిమ్మ గింజలు రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. మధుమేహంతో బాధపడుతున్న వారికి దానిమ్మపండు వరంగా చెప్పవచ్చు.