పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆరోగ్యానికి మంచి చేసే పండ్లలో దానిమ్మ ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దానిమ్మ పండు ఖరీదు కూడా కాస్త ఎక్కువనే చెప్పాలి. దానిమ్మ పండులోని దానిమ్మ గింజలు తినాలంటే ముందు దానిమ్మ పండు యొక్క తొక్కను శుభ్రంగా వలుచుకుని దానిమ్మ గింజలను తినాలి. అయితే గింజలను తిని దానిమ్మ తొక్కను మాత్రం పారేస్తాము కదా.. నిజానికి మనం పారేసే ఈ దానిమ్మతొక్కతో ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే మీరు షాక్ అవ్వాలిసిందే.
దానిమ్మ తొక్క ఉపయోగాలు :
దానిమ్మ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అలాగే దానిమ్మ పండు తొక్క మన అందానికి అంత మేలు చేస్తుంది అదెలా అని అనుకుంటున్నారా.. నిజానికి దానిమ్మ తొక్కలో సూర్య కిరణాల నుంచి వచ్చే హానికరమైన అల్ట్రా వేవ్ కిరణాల నుంచి మీ చర్మాన్ని కాపాడంలో మీకు ఎంతగానో రక్షణ ఇస్తుంది.అందుకే దానిమ్మ తొక్కలను పడవేయకుండా దానిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకుని అందులో రోజ్ వాటర్ కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చర్మానికి నిగారింపు వచ్చి ప్రకాశవంతంగా మెరుస్తుంది.
దానిమ్మ తొక్కను ఎలా ఉపయోగించాలంటే..?
అలాగే దానిమ్మ తొక్కలకు మొటిమలు పోగొట్టే గుణం కూడా ఉంది. దానిమ్మ తొక్కల పొడిని రెండు రోజులకోసారి నీళ్లలో కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకుని ఒక అరగంట పాటు అలానే ఉంచి తరువాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే మొటిమల నుంచి ఉపశమనం లభిస్తుంది.అలాగే దానిమ్మ తొక్కల పొడిని నీటిలో కలిపి ఆ నీటితో నోరు పుక్కిలిస్తే నోటి దుర్వాసన పోతుంది.గాయాలు, పుండ్లకు కూడా దానిమ్మ తొక్కలు మంచి మెడిసిన్ అనే చెప్పాలి.వీటిని మెత్తని పేస్టులా చేసి గాయాలకు రాస్తే త్వరగా మానిపోతాయి.