దానిమ్మ పండు అంటే పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. చూడడానికి ఎంతో అందంగా, రుచికరంగా ఉంటుంది.దానిమ్మ పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ దానిమ్మ పండులో ఐరన్, కాల్షియం,మెగ్నీషియం, పొటాషియం,జింక్,విటమిన్ బి,విటమిన్ సి, విటమిన్ కె,ప్రోటీన్,ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి.దానిమ్మ పండును జ్యూస్ గా చేసుకుని కూడా తీసుకోవచ్చు.
దానిమ్మ పండు ఉపయోగాలు :
ఇవే కాకుండా దానిమ్మ పండులో మరెన్నో పోషకాలు ఉన్నాయి. మరి దానిమ్మ పండు మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతుందో తెలుసుకుందాం.దానిమ్మ పండులో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దానిమ్మ పండు తింటే రోగానిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
సంతాన లేమి సమస్యకు దానిమ్మ బెస్ట్ :
అలాగే సంతానలేమితో బాధపడే దంపతులు దానిమ్మ పండును తింటే ఎంతో మంచిది.
దానిమ్మలో ఉండే పలు పోషకాలు
స్త్రీ,పురుషుల్లో లైంగిక సమస్యలను తొలగించి సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయి.అలాగే జాయింట్ పెయిన్స్‌తో ఇబ్బంది పడుతున్నవారికి దానిమ్మ పండు ఒక మంచి మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది. రాత్రిపుట దానిమ్మ రసం తాగితే ఆకలి వేయకపోవడంతో పాటు బరువు కూడా పెరగరు.