Seymiyaa: వేసవికాలం సెలవులు కావడంతో.. హడావుడిగా తిని పరిగెత్తే పిల్లలకు తినే వాటిని ఆస్వాదించే అవకాశం దక్కింది..! వాళ్ళ కోసం పూటకో కొత్త వెరైటీ చేసి పెట్టాలి అంటూ తల్లులు హైరానా పడుతున్నారు.. సాధారణంగా చేసే టిఫిన్ తిని తిని బోర్ కొడుతుంది పిల్లలకి.. ఇక పులిహార అంటే ఎంతా ఇష్టంగా చేసినా తినడానికి మక్కువ చూపించడం లేదు పిల్లలు.. కాస్త వెరైటీగా కాస్త డిఫరెంట్ గా సేమియా నిమ్మకాయ పులిహోర అయితే సూపర్.. ఐడియా బాగుంది కదా.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..!
సేమ్యా ఒక కప్పు, పల్లీలు రెండు చెంచాలు, జీడిపప్పు రెండు చెంచాలు, నిమ్మకాయ ఒకటి, పసుపు చిటికెడు, పచ్చిమిర్చి రెండు, కరివేపాకు రెండు రెబ్బలు, ఎండుమిర్చి రెండు, తాలింపు దినుసులు ఒక చెంచా, నెయ్యి రెండు చెంచాలు, నీళ్లు రెండు గ్లాసులు.
ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకుని అందులో అర లీటర్ నీటిని పోసి బాగా మరిగించాలి. మీరు బాగా మరిగిన తరువాత అందులో కొద్దిగా పసుపు వేయాలి . ఇప్పుడు అర చెంచా ఉప్పు ఆ నీళ్లలో వేయాలి. ఆ నీటిలో సేమ్యా వేసి ఉడికించాలి. సేమ్యా బాగా ఉడికిన తరువాత ఆ నీటిని వంపేయాలి. సేమ్యా పొడిపొడిగా ఉండటానికి మరో ప్లేట్ లోకి పెట్టుకోవాలి..
పొయ్యి మీద మరో గిన్నె పెట్టుకుని తాళింపు సిద్ధం చేసుకోవాలి. ఒక గిన్నెలో రెండు చెంచాల నెయ్యి వేసి జీడిపప్పు వేరుశెనగపప్పు వేయించుకోవాలి. అందులోనే తాలింపు గింజలు వేసి వరుసగా ఎండుమిర్చి కరివేపాకు రెబ్బలు జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న సేమ్యాలో కొద్దిగా ఉప్పు వేసి అందులో తాలింపు పోసి బాగా కలుపుకోవాలి. చివరలో రసం వేసి బాగా కలపాలి. ఫైనల్ గా కొత్తిమీర చల్లుకుంటే టేస్టీ టేస్టీ సేమ్యా పులిహార తినడానికి రెడీ..
విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…