ఈ సీజనల్ దోమలు బాగా ఉంటాయి.అలాగే అంటు వ్యాధులు కూడా ఎక్కువగా ప్రబలే అవకాశం ఉండడంతో తినే తిండి విషయంలో, పరిసరాల శుభ్రత విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.మలేరియా, టైఫాయిడ్,డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ ఎక్కువాగా వస్తాయి. ముఖ్యంగా డెంగ్యూ వంటి జ్వరాలు దోమ కాటు వలన వ్యాపిస్తాయి.ప్రతీ ఏటా చాలా మంది డెంగ్యూ భారిన పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతాయి. వర్షాకాలంలో నీరు అధికంగా నిలువ ఉంటుంది కాబట్టి దోమలు పెరిగి జబ్బులను వ్యాప్తి చేస్తాయి. డెంగ్యూ వలన అధిక జ్వరం, తలనొప్పి, కళ్లు లాగడం, అలసట, కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు, వికారం, వాంతులు వంటి ఏర్పడుతాయి. డెంగ్యూ జ్వరానికి సకాలంలో చికిత్స అందించాల్సి ఉంటుంది. అయితే డెంగ్యూ జ్వరాన్ని నియంత్రించడంలో కొన్ని రకాల హోం రెమెడీస్ బాగా పనిచేస్తాయి. మరి ఆ ఇంటి చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. తిప్పతీగ జ్యూస్:
తిప్పతీగ గురించి మన అందరికి తెలిసే ఉంటుంది. అయితే ఈ తిప్ప తీగ డెంగ్యూ జ్వర నివారణిగా బాగా ఉపయోగపడుతుంది.తిప్పతీగ రసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది తద్వారా డెంగ్యూ జ్వరాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఇది ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది. ఒక కప్పు మరిగించిన నీటిలో కొన్ని చుక్కల తిప్పతీగ రసాన్ని కలిపి రోజుకు రెండుసార్లు త్రాగవచ్చు. అయితే, ఈ తిప్పతీగ రసాన్ని అధికంగా తీసుకోకూడదు.
బొప్పాయి ఆకు:
డెంగ్యూ రోగులలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గుకుండా ఉండాలంటే బొప్పాయి ఆకు రసం తీసుకోవాలి. ఇది ప్లేట్లెట్ కౌంట్‌ను పెంచడంలో అద్భుతంగా పని చేస్తుంది. బొప్పాయి ఆకు రసం కూడా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అందుకే బొప్పాయి ఆకుల రసాన్ని రెండుకు రెండుసార్లు కొద్ది మోతాదులో తీసుకోవాలి.
జామ పండ్ల రసం:
జామ పండ్ల రసం డెంగ్యూ జ్వరానికి బాగా ఉపయోగపడుతుంది.ఒక కప్పు జామ రసాన్ని రోజుకు రెండుసార్లు త్రాగాలి. జ్యూస్‌కు బదులుగా తాజా జామపండ్లను కూడా తినవచ్చు.ఇవే కాకుండా
రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్ధాలు కూడా తింటూ ఉండాలి. తినే ఆహారంలో సిట్రస్ ఆహారాలు, వెల్లుల్లి, బాదం, పసుపు వంటి.రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి.
నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస ఫ్లాపులను మూడగట్టుకున్నాడు. ఈయన నుండి వచ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…