Chematakayalu: సమ్మర్ వచ్చిందంటే చాలామంది ఫేస్ చేసే సమస్య ప్రిక్లీ హీట్, అంటే చెమటకాయలు. ఈ సమస్య ఉన్నప్పుడు చిన్న ఎర్ర స్పోర్ట్స్ వస్తాయి. స్కిన్ మీద ఇవి పొడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ చెమట కాయలు శరీరం మీద ఎక్కడైనా రావచ్చు. కానీ ఇవి ఎక్కువగా ఫేస్, నెక్, చాతి మరియు తొడల మీద వస్తాయి. ప్రత్యేకించి వేడి వాతావరణానికి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇలా రావచ్చు. బాగా వేడిగా, చెమట పట్టే వాతావరణంలో హీట్ రాష్ మొదలవుతుంది. చెమట వల్ల ఏర్పడే బ్యాక్టీరియా, డెడ్ స్కిన్ సెల్స్ కలిసి చమట గ్రందులని మూసేస్తాయి. ఫలితంగా చెమట చర్మం లోపలే ట్రాప్ అయిపోతుంది. ఇది ఒక్కసారి బర్డ్స్ అయినప్పుడు పొడుస్తున్న ఫీలింగ్ ఉంటుంది.

ఈ ప్రిక్లీ హీట్ అనేది ఏ విధంగా చేయాలో
తెలుసుకుందాం..
ఈ విషయంలో గోల్డెన్ రూల్ ఏమిటంటే మీ బాడీని కూల్ గా, బాగా గాలి తగలేట్లుగా ఉంచుకోవడం. మీకు చెమట కాయలు ఉన్నచోట దుస్తులు పక్కకి తప్పించి చల్లని గాలికి ఆ ప్రదేశాన్ని ఎక్స్పోజ్ చేయండి. సమ్మర్ లో మీరు తేలికగా, వదులుగా ఉండే బట్టలు లేత రంగులో ఉన్నవి వేసుకోవాలి. వేడి గాలు, ఎండలు శరీరంలోని శక్తిని పీల్చేస్తాయి. అందుకోసం మీరు హైడ్రేటెడ్ గా ఉండడం ఎంతో అవసరం. మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరినీరు వంటి నేచురల్ కూలర్స్ తీసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల సమ్మర్ హీట్ ని బీట్ చేయగలరు. సలాడ్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ వంటివి ఎక్కువగా తీసుకోండి. వేపుళ్ళు, స్వీట్స్ వంటివి వీలైనంతవరకు చేయండి. ముఖ్యంగా మసాలాలు మానేయండి. మీకు చెమట కాయలు ఉన్న ప్రదేశంలో చల్లని పెరుగుని అప్లై చేసి 15 నిమిషాలు ఉంచి వాటిని చల్లని నీటితో కడిగేయడం వల్ల చెమట కాయలు తగ్గుతాయి. ముల్తానీ మట్టి వాడడం వల్ల కూడా చర్మం చల్లబడుతుంది. ఈ సీజన్లో వీటిని వాడటం ఎంతో ఉపయోగకరం.
1)గాలి తగిలి బట్టలు వేసుకోండి
2) సింథటిక్ బట్టలు వేసుకోండి
3) హైడ్రేటెడ్ గా ఉండండి
4) హెల్దీ ఫుడ్స్ తీసుకోండి
5) స్కిన్ పొడిగా ఉంచుకోండి
చెమటకాయలు తగ్గించే ప్యాక్..
* రోజ్ వాటర్: 200 ఎంఎల్ రోజ్ వాటర్ లో నాలుగు టేబుల్ స్పూన్ల తేనె, 200 మంచి నీళ్ళు కలపండి. బాగా కలిపి ఐస్ ట్రే లో పోసి ఫ్రీజ్ చేయండి. ఇవి క్యూబ్స్ లా అయ్యాక నాలుగైదు క్యూబ్స్ తీసుకుని పల్చని కాటన్ క్లాత్ లో చుట్టి చెమట కాయలు ఉన్న ప్రదేశం లో మృదువుగా అద్దండి. రోజ్ వాటర్ స్కిన్ యొక్క పీహెచ్ బ్యాలెన్స్ ని మెయింటెయిన్ చేస్తుంది.
* గంధం : గంధానికి చల్లని పాలు కలిపి ఆ మిశ్రమాన్ని చెమట కాయలు ఉన్న ప్రదేశం లో రాసి ఆరనివ్వండి. ఆ తరువాత చల్లని నీటితో కడిగేయండి.
*;ముల్తానీ మట్టి : మూడు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిలో, రెండు టీ స్పూన్ల పుదీనా పేస్ట్ కలిపి తగినన్ని చల్లని పాలు పోసి మెత్తగా మిశ్రమంలా చేసి.. ఆ మిశ్రమాన్ని స్కిన్ మీద అప్లై చేసి గాలికి ఆరనివ్వండి. ఆ తరువాత చల్లని నీటితో కడిగేయండి.
* ఇవి చేస్తున్నప్పుడు ఫ్యాన్ కింద కూర్చోవడం మంచిది. నీటితో కడిగేశాక మెత్తని టవల్‌తో అద్దుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది.
*పెరుగు: పెరుగు చర్మాన్ని బాగా చల్లబరుస్తుంది. మీకు చెమట కాయలు ఉన్న ప్రదేశం లో చల్లని పెరుగుని రాసి పదిహేను నిమిషాలు ఉంచండి. ఆ తరువాత చల్లని నీటితో కడిగేసి మెత్తగా అద్దండి. పెరుగులో సహజంగానే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవి యాక్నే రాకుండా అడ్డుకుంటాయి.