గుండె ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొవ్వు, కొలెస్ట్రాల్ సమానం గా ఉండే ఆహారాన్ని తీసుకోవడం అవసరం. గుండెని సురక్షితంగా ఉంచుకోవాలంటే రోజువారీ ఆహారంలో ఖనిజాలు,పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ధమనులు, సిరల్లో, చక్కని రక్త ప్రసరణ కోసం ఇవి తోడ్పడతాయి. వాటిగురించి తెలుసుకుందాం.
అధిక రక్తపోటు నుంచి విటమిన్ సి రక్షిస్తుంది. అధిక రక్తపోటు గుండె జబ్బులకు ప్రధాన కారణం. ఇది ఎక్కువగా నిమ్మ, నారింజ, జామ, కివి, ద్రాక్షపండు, కాలీఫ్లవర్, బ్రకోలీ, క్యాప్సికమ్ లో లభిస్తుంది.ఫ్లేవనాయిడ్లు ద్రాక్ష,నారింజ పండ్ల లో పుష్కలంగా లభిస్తుంది . రక్తం గడ్డకట్టడం వల్ల వచ్చే ఇస్కీమిక్ స్ట్రోక్ నుంచి ఇవికాపాడతాయి .విటమిన్ కె రక్త నాళాల కాల్సిఫికేషన్‌ను అడ్డుకోవడం తో పాటు ప్రోటీన్‌ను యాక్టివేట్ చేస్తుంది.
ఆవపిండి, పార్స్లీ,, కాలీఫ్లవర్, మొలకలు, బ్రకోలీ, క్యాబేజీ, చేపల కాలేయం, గుడ్లు,మాంసం, అవకాడో,కివి, బ్లాక్ బెర్రీస్, దానిమ్మ వంటి వాటిలో విటమిన్ కె ఎక్కువగాలభిస్తుంది. జింక్ ఆక్సీకరణ సమస్యను ఎదుర్కొని గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది., చిక్కుళ్ళు, విత్తనాలు, కాయలు, పాడి ఉత్పత్తులు, గుడ్లు, మాంసం, షెల్ ఫిష్ తృణధాన్యాల్లో జింక్ఎక్కువగా దొరుకుతుంది. క్వెర్సెటిన్హృదయ సంబంధ వ్యాధులపై పోరాడుతుంది.
క్వెర్సెటిన్ తెలుపు ,ఎరుపుఉల్లిపాయ, చెర్రీస్, ఎరుపు యాపిల్, వండిన ఆస్పరాగస్, ఎర్ర ద్రాక్ష, బ్రకోలీ, కాలే, పాలకూర,బ్లాక్ గ్రీన్ టీలలో పుష్కలంగా లభిస్తుంది. ఎన్-ఎసిటైల్సిస్టీన్ గుండెలోని కణజాలాలకు ఆక్సీకరణ ద్వారా జరిగే నష్టంలేకుండా చేస్తుంది. ఇది నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. సిరల్లో రక్త ప్రవాహాన్నిమెరుగు పరచడానికి సహాయపడుతుంది. చిక్కుళ్ళు, పొద్దుతిరుగుడు విత్తనాలలో ,చికెన్, పెరుగు, జున్ను, గుడ్లు,ఎన్-ఎసిటైల్సిస్టీన్ లభిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. సోయాబీన్, టోఫు, కాయలు, పాల రొట్టె, జున్ను, పెరుగు, పాలు,చేపలను ఆహారం లో క్రమం తప్పకుండా తీసుకోవాలి.