న్యూస్ హెల్త్

ఇవి తింటే బలంగా ఉంటారు..! ఏ జబ్బులు రావు..

Share

మనం తీసుకునే ఆహారం పైనే మన ఆరోగ్యం ఆధారపడి వుంటుంది.. కాస్త పెద్ద వయసు వచ్చాక బలమైన ఆహారం తీసుకోమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. కానీ ఈ తరం వారిని మాత్రం ఇప్పటినుంచే ఆరోగ్యకరమైన ఆహారం తినమని సలహా ఇస్తున్నారు.. ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినమని సూచిస్తున్నారు.. ప్రోటీన్ తీసుకుంటే శరీరం బలంగా ఉండి.. వివిధ రకాల వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.. ఇంకా ఎముకలు, కండరాలు పటిష్టంగా తయారవుతాయి..! ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారం పదార్ధాలు గురించి తెలుసుకుందాం..!

కోడిగుడ్డు సంపూర్ణ పోషక ఆహారం. ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.. ప్రతిరోజు ఒకటి లేదా రెండు ఉడకబెట్టిన గుడ్డు తినడం వల్ల శరీరానికి కావలసిన ప్రొటీన్లు లభిస్తాయి. గ్రీకు పెరుగు ఇది ఒక రకమైన పెరుగు. ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది . ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీనినీ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ప్రోటీన్ లోపం తగ్గుతుంది. శరీరం బలంగా తయారవుతుంది.

స్కిమ్డ్ పాలు తాగడం వల్ల ఎముకలు, కండరాలు బలంగా తయారవుతాయి. శరీరం కు కావలసిన ప్రోటీన్ ఈ పాల ద్వారా అందుతుంది. స్కిమ్డ్ పాలులో సాధారణ పాలు కంటే కూడా ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది. సోయాబీన్స్ లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్ లోపం పోవాలంటే రోజు ఒక కప్పు ఉడకబెట్టిన సోయాబీన్స్ తినాలి. అయితే వీటిలో కొవ్వు కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే బరువు ఎక్కువగా ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే మంచిది. ప్రోటీన్ ఆహార పదార్థాలు ముసలివారు తీసుకోవడం మంచిది. వీరు ఆ వయసులో వచ్చే అనారోగ్య సమస్యలను జయించడానికి సహాయపడుతుంది. ఇంకా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల జుట్టు గోర్లు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి. హార్మోన్లు, ఎంజైమ్స్ తయారవుతాయి. ఇది మన శరీరంలో ఎన్నో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. శరీరంలో ప్రోటీన్ లోపిస్తే ఎన్నో వ్యాధులకు దారి తీస్తుంది. అందుకే ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి.


Share

Related posts

Pawan Kalyan: రామ్ చరణ్.. పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ సినిమా..??

sekhar

Aishwarya Rai Bachchan: బిగ్ బి కుటుంబం లో ఐశ్వర్యారాయ్ అంటే ఇష్టం లేనిది ఎవరికో తెలుసా??

Naina

Death anniversary: ఆ ప్రాంతం లో సంవత్సరీకం ఎలా చేస్తారో తెలిస్తే.. పొరపాటున కూడా అక్కడ పుట్ట కూడదని కోరుకుంటారు!!

Naina