Hair Growth: పురుషులు, స్త్రీలు ఇద్దరికీ నల్లని, ఒత్తైన కురులు కావాలని కోరుకుంటారు.. అందుకోసం తెలిసిన చిట్కాలు ప్రయత్నిస్తుంటారు.. ఇక మార్కెట్లో దొరికే రకరకాల నూనెలు వాడుతుంటారు.. అంతే కానీ వారు తీసుకునే ఆహారం పై ఇసుమంత శ్రద్ధ వహించరు.. మన ఆహారంలో ఇవి ఉంటే జుట్టు ఊడమన్న ఊడదు..!! ఇంతకీ అవెంటంటే..!?

జుట్టు కణాల పెరుగుదలకు విటమిన్ ఎ అవసరం. బచ్చలి కూర, గుమ్మడి కాయ, క్యారెట్ పాలు, గుడ్లు, పెరుగు లో విటమిన్ ఎ లభిస్తుంది. విటమిన్ బి జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది ఆకుకూరలు తృణధాన్యాలు బాదంపప్పు మాంసం చేపలలో విటమిన్ బి సమృద్ధిగా లభిస్తుంది. విటమిన్ సి లో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి డ్యామేజ్ హెయిర్ ను రిపేర్ చేయడానికి సహాయపడుతాయి. సిట్రస్ పండ్లు, స్ట్రాబెర్రీ, జామ, మిరియాలు లో విటమిన్ సి దొరుకుతుంది. విటమిన్ డి జుట్టుకు కావలసిన పోషణను అందిస్తుంది పుట్టగొడుగులు, కాడ్ లివర్ ఆయిల్, చేపలు లో విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది. కేశాల సంరక్షణకు విటమిన్ డి ఎంతగానో అవసరం. అవకాడో, బాదంపప్పు, బచ్చలికూర, పొద్దుతిరుగుడు విత్తనాలు లో విటమిన్ ఇ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

కేశాల సంరక్షణకు ప్రోటీన్ కూడా అవసరం. వీటితో పాటు ఐరన్, జింక్ ఎక్కువగా ఉండే ఆహారాలను మీ డైట్ లో భాగంగా చేసుకోవాలి. గోధుమలు, గుమ్మడికాయ విత్తనాలు, చిరు ధాన్యాలు, తాజా పండ్లు, కూరగాయలు, సీజనల్ పండ్లు, కూరగాయలు మీ రెగ్యులర్ డైట్ లో భాగంగా చేసుకుంటే నల్లని ఒత్తైన కురులు మీ సొంతం