Psoriasis: సోరియాసిస్ అంటే ఇది చర్మ సంబంధ వ్యాధి. చర్మంపై పోలుసులుగా వచ్చి.. దురద పెడితే గోకితే.. పొట్టులుగా రాలిపోతూ ఉంటుంది. తెలుగులో దీన్ని పోలుసుల వ్యాధి అంటారు. కుటుంబంలో ఎవరికైనా సోరియాసిస్ ఉంటే మరొకరికి వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఒత్తిడి, ఒబేసిటీ, ఊబకాయం, మద్యపానం, పొగాకు వంటి దురాలవాట్లతో కూడా సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంది. ఇది శరీరంలో తల నుండి అరికాల వరకు ఎక్కడైనా రావచ్చు.

సోరియాసిస్ లో రకాలు:
ప్లేక్ సోరియాసిస్
గట్టేట్ సోరియాసిస్
విలోమా సోరియాసిస్
పస్ట్యులర్ సోరియాసిస్
ఎరిత్రోడేర్మిక్ సోరియాసిస్
నేయిల్ సోరియాసిస్.
ప్లేక్ సోరియాసిస్ లక్షణాలు:
ఈ రకమైన సోరియాసిస్ దాదాపు 90 శాతం కేసులను కలిగి ఉంటుంది. ఇది పై భాగంలో తెల్లటి పోలుసులతో… ఎర్రటి ప్యాచిస్ ద్వారా ఒదిగి ఉంటుంది. దీనినే సోరియాసిస్ వల్గరిస్ అని కూడా అంటారు. ఇది సాధారణంగా చేతుల వెనక తల, జననేంద్రియాల చుట్టూ.. నోటి లోపల మృదు కణజాలంపై.. సంభవిస్తాయి
· ఎర్రబడిన చర్మం యొక్క పెరిగిన ప్రాంతాలు
· దురద మరియు బాధాకరమైన గాయాలు
నెయిల్ సోరియాసిస్ లక్షణాలు:
ఈ రకం వేలుగోళ్లు మరియు గోరు రంగులో గుంటలు మరియు మార్పులకు కారణమవుతుంది . చాలా మంది జీవితంలో ఏదో ఒక సమయంలో నెయిల్ సోరియాసిస్‌ను ఎదుర్కొంటారు.
· మందమైన గోర్లు
· పిట్టెడ్ గోర్లు
· అసాధారణ గోరు పెరుగుదల
· గోరు రంగు మారడం
· గోరు మంచం నుండి గోరు వదులైంది
· నలిగిన గోరు
గట్టెట్ సోరియాసిస్ లక్షణాలు:
ఈ రకం మచ్చలు చిన్నవిగా మరియు విడిగా మరియు నీటి-చుక్క ఆకారంలో ఉంటాయి. అవి శరీరం, అవయవాలు, ముఖం మరియు తలపై ప్రభావం చూపుతాయి.
· ప్రధానంగా యువకులు మరియు పిల్లలను ప్రభావితం చేస్తుంది
· నీటి-చుక్క ఆకారపు గాయాలు
· ట్రంక్, చేతులు, కాళ్లు, నెత్తిమీద చర్మం స్కేలింగ్
· గాయాలు ఆకస్మికంగా విస్ఫోటనం
విలోమ సోరియాసిస్ లక్షణాలు:
ఈ రకం చర్మం యొక్క మడతలలో ఎర్రటి పాచెస్ ఏర్పడటం ద్వారా వర్గీకరించబడుతుంది . దీనిని ఫ్లెక్సురల్ సోరియాసిస్ అని కూడా అంటారు .
· బొబ్బలు త్వరగా అభివృద్ధి చెందుతాయి
పస్ట్యులర్ సోరియాసిస్:
ఈ రకమైన సోరియాసిస్ కారణంగా శరీరంపై చీముతో.. నిండిన బొబ్బలు చిన్నగా చేతులు మరియు కాళ్లపై ప్రభావితం చేస్తాయి. ఈ రకమైన సోరియాసిస్ లక్షణాల కలిగిన రోగులు ఫ్లూ వంటి లక్షణాలు కూడా కలిగి ఉండవచ్చు.
ఎరిత్రోడెర్మిక్ సోరియాసిస్:
ఇది ఇతర రకాల స్టోరేజ్ నుండి అభివృద్ధి చెందుతుంది. దీంతో శరీరంలో దద్దుర్లు వల్ల ఎరుపు మరియు పోలీసులుగా మారి.. విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. ఇది వస్తే గనుక ఆసుపత్రుల చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
సోరియాసిస్ చికిత్స విధానం:
వ్యాధి తీవ్రతబట్టి వైద్యుడు యొక్క సూచన బట్టి తీసుకోవలసి ఉంటుంది. ఒక్కోసారి హాస్పిటల్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కొన్ని సోరియాసిస్ బ్యాక్టీరియా తో కూడినవి ఉండే అవకాశం ఉండటంతో… కుటుంబంలో మరొకరికి రాకుండా చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. చాలా వరకు చేప నూనెలో ఉండే ఒమేగా 3… కొవ్వు ఆమ్లాలుతో సోరియాసిస్ కి చికిత్స అందిస్తూ ఉంటారు. ఇంకా రోజు వారి స్నానం చేయటం, స్నానం తర్వాత మాయిశ్చరైజ్… వంటి విధానాల ద్వారా సోరియాసిస్ నీ నివారించవచ్చు. ఇక ఉదయాన్నే వచ్చే సూర్యరశ్మి ద్వారా కూడా సోరియాసిస్ యాజకి గురైన చర్మాన్ని నివారించవచ్చు. ఆ సమయంలో వచ్చే కిరణాలవల్ల చర్మం ఆరోగ్యంగా మళ్ళీ నియంత్రత్వంలోకి రావటం జరుగుతుందట. అయితే సూర్యకాంతి ఎక్కువగా ఉంటే ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సోరియాసిస్ వ్యాధి భారీన పడిన వాళ్ళు కచ్చితంగా ఆల్కహాల్ అలవాటులను మానుకోవాలి. ఇంకా పాల ఉత్పత్తులు… మాంసాహారాన్ని తగ్గించుకోవాలి. ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే సోరియాసిస్ బారిన చర్మాన్ని మళ్లీ తిరిగి ఆరోగ్యవంతమైన చర్మంగా మార్చుకోవచ్చు.