మనలో చాలా మంది పండిన పండ్లను తినడానికి ఇష్టపడతారు. కాని కొన్ని పండ్ల ను పచ్చిగా ఉన్నపుడు తిన్న ఎక్కువ ప్రయోజనాలను ఇస్తాయి. ముఖ్యంగా పచ్చి బొప్పాయి లేదా ముడి బొప్పాయి ఉదర సంబంధిత వ్యాధుల నివారణకు బాగా ఉపయోగపడుతుంది.
ముడి బొప్పాయి గ్యాస్, కడుపు నొప్పి మరియు జీర్ణక్రియ సమస్యలకు మంచి ఔషధం అని చెప్పవచ్చు.. వీటన్నిటి తో పాటు,ఆర్థరైటిస్ సమస్యల కి ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రీన్ టీ తో ముడి బొప్పాయినిఉడకబెట్టడం ద్వారా తయారుచేసిన టీని తీసుకోవడం వలన ఆర్థరైటిస్‌ను నయం చేస్తుంది. ముడి బొప్పాయి క్రమం తప్పకుండా తీసుకోవడం వలన బరువు సులభం గా తగ్గవచ్చు.ఇది రక్తంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
ఇది మూత్రపిండ సమస్యలను పోగొట్టడం లో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది . కామెర్లు వచ్చినప్పుడు లేదా కాలేయానికి సంబంధించిన ఇతర సమస్యలకి కూడా ప్రభవ వంతంగా పనిచేస్తుంది . విటమిన్లు ఎ, ఇ, సి యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్స్ మరియు క్యాన్సర్‌ను తొలగించే ఇతర పోషకాలు ముడి బొప్పాయిలోఉన్నాయి.
ముడి బొప్పాయి పోషకాల తో ఎంజైమ్లతో నిండి ఉంటుంది. కాయ పండినప్పుడు ఎంజైమ్ స్థాయిలు తగ్గుతాయి. ముడి బొప్పాయి ఇంకా ఆకుపచ్చగా ఉన్నప్పుడు దాని సహజ ఎంజైమాటిక్ లక్షణాలనునిలిపి ఉంచుతుంది. ముడి బొప్పాయి లోచాలా ముఖ్యమైన విటమిన్లు ఉన్నాయి. ఆకుపచ్చ బొప్పాయి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ప్రయోజనకరం కాదు అని గుర్తు పెట్టుకోవాలి.ముడి బొప్పాయి లేదా పచ్చి బొప్పాయి మెదడును అభివృద్ధి చేయడంలో మరియు మరింత చురుకుగా చేయడంలో సహాయపడుతుంది.ఎముకలు బలంగా తయారవడానికి సహాయపడుతుంది.