కరోనా నుంచి కోలుకున్నారా? అయితే ఈ లక్షణాలు మీలో ఉన్నాయేమో చెక్ చేసుకోండి!

కరోనా వైరస్ గురించి మనం ఎంత తెలుసుకున్నా తెక్కువేననిపిస్తుంటుంది. ఎందుకంటారా… కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తలు రోజుకో భయంకరమైన విషయాలను వెళ్లడిస్తూనే ఉన్నారు. ఈ కరోనాను నివారించడానికి పగలు రాత్రి అనే తేడా లేకండా వ్యాక్సిన్ కోసం కష్ట పడుతూనే ఉన్నారు. కాగా ఎంత సోషల్ డిస్టెన్స్ పాటించించా, అది సోకకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ వైరస్ వ్యాపిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే ఈ కరోనా వైరస్ లక్షణాల గురించి శాస్త్రవేత్తలు రోజుకో అంశాన్ని చెప్పడంతో ప్రజల్లో భయం పుట్టుకొస్తుంది.

చిన్న జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా వామ్మో నాకు గాని కరోనా సోకిందా అని అనుమాన పరిస్థితి ఏర్పడింది. కరోనా వచ్చి కొందరు మరణించినా.. కొందరు బతికి బయటపడ్డారు. అలా బయటపడ్డ వారి గురించి శాస్త్రవేత్తలు షాకింగ్ విషయాన్ని వెళ్లడించారు. కరోనా నుంచి కోలుకున్న కొంతమందిలో మెదడు పనితీరుపై ప్రభావం పడుతోందని సైంటిస్టులు తెలుపుతున్నారు. వీరిలో చాలా మందికి మానసిక సమస్యలకు దారితీస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

వీరి మెదడు వయస్సు కూడా 10 ఏండ్ల పిల్లాడి మనస్తత్వంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. లండన్ ఇంపెరియల్ కాలేజీలో డాక్టర్ Adam Hampshire సమక్షంలోని వైద్యుల బృందం 84వేల మందికి పైగా అధ్యయనం చేసింది. వీరిలో కరోనా తీవ్రమైన కేసుల్లో చాలా మంది కొన్ని నెలల పాటుగా మానసికపరమైన సమస్యలకు దారితీసిందని పరిశోధకులు గుర్తించారు. వీరిలో మెదడు పనితీరుపై పరిశోధన జరుపగా కొన్ని విషయాలను గుర్తించారు.

పదాలను గుర్తుపట్టడం లేదా పజిల్ పూర్తి చేయమనడం వంటి పరీక్షల్లో కరోనా నుంచి కోలుకున్న వారి మెదడు తాత్కాలికంగా బలహీనపడ్డట్టు పరిశోధకులు వెళ్లడించారు. ఈ అధ్యయనంలో భాగంగా 84,285 మందిపై Great British Intelligence Testతో పరీక్షించింది. వారిలో 20 ఏండ్ల నుంచి 70 ఏండ్ల వయస్సు మధ్య వారి మెదడు 10 ఏండ్ల వయస్సు మెదడుకు సమానమని పరిశోధకులు వెళ్లడించారు. ఇప్పటికైనా కరోనా రాకుండా జాగ్రత్త పడండి..