ఒంట్లో కొవ్వును.. యాపిల్ టీతో ఇలా తగ్గించండి!

అధిక బరువుతో బాధపడుతున్నారా? అధిక వెయిట్ తో నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బంది పడతున్నారా.. అయితే మీ కోసమే ఈ ప్రాడక్ట్ అంటూ మార్కెట్ లో రకరకాల పిల్స్, టాబ్లెట్ల రూపంలో దర్శనమిస్తాయి. తమ సేల్స్ ను పెంచుకోవడం కోసం రకరకాలుగా ఉన్నవి లేనివి అన్నీ కల్పించి జనాలను పిచ్చొల్లను చేసి మరీ తమ ప్రొడక్ట్స్ ను అమ్ముకుంటారు. అవి వాడకం మూలంగా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. కాని అవి పట్టించుకునే ఓపిక జనాలకొవ్వరికీ లేకపోవడం మూలంగా అవి వాడుతూ.. ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు. అదీ కాక వెయిట్ తగ్గుతారా అంటే అదీ లేదు. ఇలా ఎందరో వెయిట్ లాస్ కోసం రకరకాల ప్రయోగాలు చేసి మోసపోయిన వారెందరో ఉన్నారు.

రకరకాల కంపెనీలు అధిక బరువును తగ్గించుకోండిలా అంటూ పని చేయని సలహాలను ఇస్తూ బిజినేస్ చేస్తున్నాయి. కాని సహజ పద్ధతుల్లోనే బరువును తగ్గడమే ఆరోగ్యానికి మంచిది. ఒక వైపు బరువు తగ్గుతూనే, మరోవైపు బలంగా, ఫిట్ గా కూడా ఉంటారు. అలాంటి అవకాశమిచ్చే ఆహార పదార్థాలను ‘వెయిట్ లాస్ ఫ్రెడ్లీ డైట్’ అని అంటారు. గ్రీన్ టీ, హెర్బల్ టీ లు.. అధిక బరువును తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి.. అలాంటి ఒక టీ కూడా వెయిట్ లాస్ కు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఎంతో రుచిగా కూడా ఉంటుంది.

ఈ టీ కేవలం రెండే రెండు పదార్థాలతో తయారవుతుంది. దీనికి పాలు అసలే అవసరమే లేదు. యాపిల్, అల్లం తో ఈజీగా వెయిట్ లాస్ టీ ని మీ ఇంట్లోనే ఎంతో తేలికగా తయారుచేసుకోవచ్చు. యాపిల్ లో కేలరీలు చాలా తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉండటం మూలంగా బరువును తగ్గించేందుకు చాలా ఉపయోగపడుతుంది. ఇది ఆకలిని తగ్గించి ఎక్కువ తినకుండా చేస్తుంది. దీనితో పాటుగా యాపిల్ రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అలాగే జీర్ణ శక్తిని కూడా మెరుగుపరుస్తుంది.

ఒంట్లో పేరుకుపోయిన వ్యర్థాలను, విషాలను బయటకు పంపించేందుకు యాపిల్ ఎంతో ఉపకరిస్తుంది. కనుక యాపిల్ అల్లం తో తయారయ్యే ఈ టీ వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కూడా కరిగించడంలో సహాయ పడుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు. అల్లం కూడా జీర్ణశక్తిని మెరుగు పరిచేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేస్తాయి. మరీ ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వారికి అల్లం మేలు చేస్తుంది.

ఒక యాపిల్ ను తీసుకుని దాని పైన ఉన్న తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. చిన్న అల్లం ముక్కను తీసుకుని దాని తోలు తీసి మిక్సీలో వేసుకోవాలి. దీనితో పాటుగా మూడు కప్పుల నీటిని తీసుకుని యాపిల్ ముక్కలు, అల్లం పేస్ట్ ను కూడా వేసి 10 నుంచి 12 నిమిషాలు ఉడకపెట్టాలి. నీటిలో యాపిల్ ముక్కలు పూర్తిగా మునిగి పోయేలా నీటిని పోసుకోవాలి. ఆ తర్వాత స్టౌను ఆపేసి ఆ నీటిని చల్లబరుచుకోవాలి. ఆ తర్వాత ఆ నీటిని మిక్సీలో గ్రైండ్ చేయ్యాలి.. ఇంకేముంది యాపిల్, అల్లం టీ రెడీ.. వేడిగా ఉన్నప్పుడే తాగితే మంచి రుచిగా ఉంటుంది. అలాగే ఈ టీని పరిగడుపున తాగితే మంచి ఫలితం ఉంటుంది. తాగి చెప్పండి ఎలా ఉందో.. మీ బరువును తగ్గించుకోండి.