Water: మనం వాడుకునే ట్యాప్స్ కొన్ని రోజుల తర్వాత పాతవి అవడం వలన లీక్ అవుతుంటాయి. పైప్స్ జాయింట్ దగ్గర కూడా కొన్ని సార్లు లీక్ జరుగుతుంటుంది. ఆ లీకేజీలను నివారించడానికి కొత్త ట్యాప్ లు పెట్టడం మంచిది. కాబట్టి ఇలాంటివి ఉంటే వెంటనే మార్చండి..ప్రస్తుతం ఉన్న కొత్త టెక్నాలజీ ట్యాప్ లను వాడటం వల్ల నీటి వాడకం తగ్గడం తో పాటు పని కూడా త్వరగా పూర్తవుతుంది. ఇక సెన్సార్ లు సెట్ చేసుకోవడం వల్ల మనం చేతులు పెట్టినప్పుడు మాత్రం నీళ్లు వస్తాయి.. వీటితో నీరు వృధా కాకుండా చూసుకోవచ్చు.
ఈ మధ్య కాలంలో కిచెన్ లో ఆర్ ఓ ఉపయోగించేవారు ఎక్కువయ్యారు. ఇది ట్యాప్ నుంచి డైరెక్ట్ గా నీళ్లు తీసుకొని దాన్ని తాగే నీట్ గా మారుస్తుంది. ఇలా తయారు చేసే క్రమంలో కొంత నీటిని వృధాగా వదిలేస్తుంది. చాలామంది ఈ నీటిని సింక్ లోకి వెళ్లేలా చేస్తున్నారు. అయితే ఆ నీటిని బకెట్ లో పెట్టి వాటిని గిన్నెలు కడిగేందుకు, కూరగాయలు కడిగేందుకు, ఉపయోగించడం వల్ల నీటిని పొదుపు జరుగుతుంది.
కూరగాయలు ,పండ్లు టాప్ కింద పెట్టి కడిగితే చాలా నీళ్లు వెస్ట్ అయినట్లే.. దానికి బదులుగా ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో కూరగాయలన్నీ కడిగేస్తే ఆ నీళ్లు మరొక దానికి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ నీటిని గిన్నెలు కడగడానికి లేదా గార్డెన్ లో మొక్కలకు నీళ్లు పోయడానికి వాడుకోవచ్చు. అలాగే గిన్నెలు కడిగిన నీళ్లు కూడా బకెట్ లో పట్టి వాటిని కూడా గార్డెన్ లో మొక్కల కు పోయడం వల్ల చాలా నీరు వృథా కాదు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?