కొబ్బరి నూనె కీ బరువు కీ సంబంధం ఏంటి గురూ ?

కొబ్బరి నూనె కీ బరువు కీ సంబంధం ఏంటి గురూ ?
Share

ఈ మధ్య కాలంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది బాగా పాపులర్. ఈ పద్ధతి లో బరువు తగ్గినవారూ ఉన్నారు, ఈ పద్ధతి నచ్చి బరువు తగ్గాక కూడా దీన్ని కంటిన్యూ చేస్తున్న వారూ ఉన్నారు. ఇది డైట్ ప్లాన్ కాదు. ఇది తినాలి, ఇది తినకూడదు అన్న రూల్స్ ఇందులో ఉండవు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎప్పుడు తినాలి అన్న దాని మీద ఫోకస్ చేస్తుంది.

కొబ్బరి నూనె కీ బరువు కీ సంబంధం ఏంటి గురూ ?

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తినే సమయాన్నీ, తినకుండా ఉండే సమయాన్నీ బాలెన్స్ చేస్తుంది. ఇందులో ఏం తిన్నా ఎనిమిది గంటల సమయం లోనే తినేయాలి.నిద్రపోతున్నప్పుడు అందరూ ఫాస్టింగ్ లోనే ఉంటారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో ఈ సమయాన్ని కొంచెం పెంచుతారు. అంటే, బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసి ఏకంగా లంచ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల సుమారు పదహారు గంటల ఫాస్టింగ్ చేస్తున్నట్టు అవుతుంది. లంచ్ నించీ డిన్నర్ వరకూ ఉన్న ఎనిమిది గంటల సమయంలోనే తినాలి. ఫాస్టింగ్ తో ఉన్న ప్రాబ్లం ఆకలి. అందుకని, ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడానికి మీకు వీలుగా ఉన్న పద్ధతి ని ఎంచుకుంటే మీకూ హాయిగా ఉంటుంది.ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో ఫాస్టింగ్ చేస్తున్న టైం లో ఎంసీటీ ఆయిల్స్ ని సప్లిమెంట్ ని తీసుకోవచ్చు. వాటి కెమికల్ స్ట్రక్చర్ వల్ల ఎంసీటీ లు మిగిలిన ఫ్యాట్స్ లా కాకుండా వేరేలా మెటబాలిజం కి గురి అవుతాయి. అవి కొవ్వు గా మారకుండా వెంటనే ఎనర్జీ గా కన్వర్ట్ అయిపోతాయి. కాబట్టి, ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు వీటిని తీసుకుంటే పెద్దగా ఇబ్బంది పడకుండా తినే సమయం వరకూ ఆగగలుగుతారు.కొబ్బరి నూనె ఎంసీటీ ఆయిల్స్ లో ఒకటి. ఇందులో తొంభై రెండు శాతం సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటే అందులో నలభై ఎనిమిది శాతం లారిక్ ఆసిడ్, ఏడు శాతం కాప్రిక్ ఆసిడ్ ఉంటాయి. వీటిని మీడియం చెయిన్ ఫ్యాటీ ఆసిడ్స్ అంటారు.

వర్జిన్ కోకోనట్ ఆయిల్ వల్ల ఎనర్జీ బాగా వస్తుంది. శరీరానికి కావాల్సిన ఫ్యాటీ ఆసిడ్స్ లభిస్తాయి. అందువల్ల కొబ్బరి నూనె సరిగ్గా తీసుకుంటే ఫాస్టింగ్ ఏజెంట్గా, క్లెన్సింగ్ ఏజెంట్ గా కూడా పని చేస్తుంది.వర్జిన్ కోకోనట్ ఆయిల్ ని తాజా కొబ్బరి నుండి తీస్తారు. ఇది సహజ పద్ధతి లో కానీ, మెకానికల్ గా కానీ జరుగుతుంది. కోల్డ్ ప్రెస్సింగ్ పద్ధతిలో తీసిన ఆయిల్ లో కొబ్బరి లోని సహజ గుణాలన్నీ ఉంటాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, కొబ్బరి నూనె ని డైట్ లో ఎలా చేర్చుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి?బ్లాక్ కాఫీ, మంచి నీరూ, టీ వంటి కాలరీలు లేని వాటిని ఫాస్టింగ్ సమయం లో తీసుకోవచ్చు. వీటన్నింటి లోనూ బ్లాక్ కాఫీ ఎక్కువ సేపు ఆకలి కాకుండా చూస్తుందని నిపుణులు చెబుతున్నారు. మీ కాఫీలో కొద్దిగా కొబ్బరి నూనె వేసుకుంటే బరువు ని కంట్రోల్ లో పెట్టుకోడం తో పాటూ ఫాస్టింగ్ ఈజీగా చేయగలుగుతారు. ఎందుకంటే, కొబ్బరి నూనె లో ఉండే ఎంసీటీ లు కాఫీ లో ఫ్యాట్ ని వెంటనే ఎనర్జీ గా కన్వర్ట్ చేస్తాయి కాబట్టి ఆకలి ని తట్టుకోవడం ఈజీ గా ఉంటుంది. వర్జిన్ కోకోనట్ ఆయిల్ ని నేచర్స్ సూపర్ ఫుడ్ అని అంటారు.

అందులో ఉండే ఎంసీటీలు తక్షణ శక్తినిస్తాయి. ఆకలిని తట్టుకునేటట్లు చేస్తాయి. కొబ్బరినూనె కలిపిన కాఫీ నీ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటారు.కాఫీలో కాకుండా వేరేలా తీసుకున్నా కూడా కొబ్బరి నూనె లోని మంచి గుణాలు మనకి చేరతాయి. కొబ్బరి నూనె ని డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు. రోజుకి రెండు స్పూన్ల కొబ్బరినూనె తీసుకుంటే ఆకలి తగ్గి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ని తేలికగా చేయగలుగుతారు.ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్రతి వారూ చేయనక్కరలేదు. అది ఆరోగ్యకరమైన ఒక లైఫ్ స్టైల్, అంతే. మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయదల్చుకుంటే క్వాలిఫైడ్ డైటీషియన్ ని కన్సల్ట్ చేసి వారు చెప్పిన ప్రకారం ప్రొసీడ్ అవ్వండి.


Share

Related posts

మనవడితో బాలకృష్ణ.. అదిరిపోయే కొత్త లుక్!

Teja

Guava: జామ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూడండి!!

Kumar

కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు సురక్షితంగా ఉంటారు?

Teja