దోమ కాటు మనిషి ప్రాణాన్ని ప్రమాదంలోకి నెడుతుంది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే తప్ప, దోమల నియంత్రణ పూర్తిగా సాధ్యం అవదు. దోమ కుట్టినప్పుడు కాసేపు నొప్పి, దురద మాత్రమే మనకు తెలుస్తుంది. కానీ దాని తర్వాతే డెంగీ, మలేరియా లాంటి వ్యాధులు చుట్టుముడతాయి.
దోమల నివారణకు కొన్ని చిట్కాలు తెలుసుకుందాం . ఇందుకు వేపనూనె, చాలా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాటన్ ను చిన్న చిన్న ఉండలుగా చేసి వాటిని వేపనూనెలో ముంచి ఇంటిలోపల ప్రతీ గదిలోనూ ఉంచాలి. దీనివల్లకూడా దోమలుకంట్రో ల్అవుతాయి. నిమ్మకాయను సగానికి కోసీ , దానిలో లవంగం మొగ్గను గుచ్చి,వాటిని పగటి పూట గదిలో ఉంచితే, డెంగీ ని వ్యాప్తి చేసే దోమలు ఆ ప్రాంతంలోకి రావు.
ఇంట్లో మూల ప్రాంతాల్లో కర్పూరం వెలిగించినా కూడా దోమలు రాకుండా ఉంటాయి. ఒక చిన్న పాత్ర తీసుకుని అందులో నీరు పోసి ఒకటి లేదా రెండు కర్పూరం బిళ్లలను బ్రేక్ చేసి అందులో వేసి గదిలో పెడితే మంచి ఫలితం ఉంటుంది. ఈ నీరు రెండు రోజులకొకసారి మార్చుకోవాలి. టీ ట్రీ ఆయిల్ ను చర్మంపై రాసుకున్నా సరే. లేకుంటే నీటిలో కలిపి ఇంట్లో స్ప్రే చేసినా మంచి ఫలితం ఉంటుంది. లావెండర్ ఆయిల్ ను రూమ్ ఫ్రెషనర్ గా ఉపయోగించుకోవడం ద్వారా చక్కని సువాసనతోపాటు, దోమలను కూడా నియంత్రించుకోవచ్చు. దీన్ని చర్మంపైనా రాసుకోవడం ద్వారా దోమల నుంచి రక్షణ పొందవచ్చు. పుదీనా మొక్కలను కిటికీల వద్ద ఉంచుకోవడం ద్వారా దోమలను నివారించ వచ్చు. ముఖ్యంగా సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత ఇంటి తలుపులు తెరవరాదు. ఆ సమయంలో దోమలు ఎక్కువగా చురుగ్గా ఉంటాయి. అప్పుడే ఎక్కువ శాతం దోమలు ఇంట్లోకి చొరబడతాయి.