న్యూస్ హెల్త్

రెస్టారెంట్ స్టైల్ చిల్లి పన్నీర్ ను ఇంట్లోనే చేసేయండిలా..!

Share

పాల నుంచి లభించే పదార్థాలలో పన్నీర్ కూడా ఒకటి.. పన్నీర్ మన ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే.. పన్నీర్ తో మనం రకరకాల వంటలను సిద్ధం చేసుకుంటూ ఉంటాం.. వాటిలో బాగా ఫేమస్ అయింది ఏంటంటే చిల్లీ పన్నీర్..! ఈ డిష్ ఎక్కువగా రెస్టారెంట్లో తినటానికి ఇష్టపడుతుంటారు.. కానీ చిల్లీ పన్నీర్ ను టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ లో మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. ఎలా తయారు చేసుకోవాలి? అందుకు కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!

చిల్లి పన్నీర్ కు కావలసిన పదార్థాలు..!

పన్నీర్ 200 గ్రాములు, మిరియాలు పొడి అర చెంచా, కారం అర చెంచా, కార్న్ ఫ్లోర్ రెండు చెంచాలు, సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు నాలుగు, సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు చక్రాల్లాగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు, పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకున్న క్యాప్సికం పావు కప్పు, పంచదార పావు కప్పు, వెనిగర్ ఒక చెంచా, సోయాసాస్ ఒక స్పూన్, చిల్లి సాస్ ఒక చెంచా, టమాటా కెచప్ ఒక చెంచా.

పన్నీర్ ను సన్నగా చతురస్త్రాకారంలో ముక్కల్లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఉప్పు, కారం, మిరియల పొడి, కార్న్ ఫ్లోర్ వేసి రెండు చెంచాల నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇందులో పన్నీర్ ముక్కలను కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టి నూనె పోసి వేడెక్కాక పన్నీర్ ముక్కలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి..

ఇప్పుడు పొయ్యి మీద మరో పాత్ర పెట్టుకొని అర చెంచా నూనె వేసి వేడయ్యాక.. అందులో వెల్లుల్లి, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పైన చెప్పుకున్న మిగతా అన్ని పదార్థాలను వేసి మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక చెంచా కార్న్ ఫ్లోర్ వేసుకొని అందులో రెండు చెంచాల నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కాన్ ఫ్లోర్ మిశ్రమాన్ని కళాయిలో వేసి అర నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇక ఆఖరుగా పన్నీర్ ముక్కలను వేసి స్లో ఫ్లేమ్ పై రెండు నిమిషాల పాటు ఆ మిశ్రమాన్ని పన్నీర్ ముక్కలకు పట్టేలాగా వేయించుకోవాలి. అంతే టేస్టీగా ఉండే చిల్లి పన్నీర్ రెడీ..


Share

Related posts

Corona: ఏపీలో క‌రోనా క‌ల‌క‌లం … మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

sridhar

Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ ‘ దిశ ‘ విడుదల IMPOSSIBLE – రిజెక్ట్ చేసిన సెన్సార్ బోర్డ్

bharani jella

చరణ్ రంగస్థలం మించి ఉంటుంది.. అందుకే సాయితేజ్ కమిటయ్యాడు ..!

GRK