స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. కానీ బయట ఉపయోగించే స్వీట్స్ లో పలు రకాల ఇంగ్రిడియంట్స్ యూస్ చేస్తారు.. పైగా చక్కెరను ఎక్కువ మోతాదులో వాడతారు.. అలా కాకుండా మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే.. ఇంట్లో ఉండే ఈ బియ్యం బెల్లం తో ఈ విధంగా స్వీట్ తయారు చేసుకొని తినండి.. టేస్ట్ కు టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం ఇంతకీ ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!
కావలసిన పదార్థాలు..
ఒక కప్పు బియ్యం, ఒక కప్పు బెల్లం, ఒక కప్పు కొబ్బరి తురుము, రెండు కప్పుల నీళ్లు, పావు కప్పు నెయ్యి, ఉప్పు అర చెంచా..
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. బియ్యం నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో బియ్యం కొబ్బరి ఒక కప్పు నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో సన్నగా తరిగిన బెల్లం వేసి.. ఒక కప్పు నీరు పోసి బెల్లం కరిగే వరకు మరిగించుకోవాలి..
ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని పైన నాన్ స్టిక్ పెద్ద కడాయి తీసుకొని అందులో బియ్యం మిశ్రమాన్ని పోయాలి. ఇందులోనే ఒక జల్లెడ గంటే సహాయంతో బెల్లం నీటిని వడపోసుకోవాలి.. ఈ మిశ్రమాన్ని సన్నని మంట మీద అడుగు అంటకుండా మెత్తగా దగ్గరకు అయ్యేలాగా తిప్పుతూ ఉండాలి. సుమారు 15 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని దగ్గర పడే వరకు తిప్పుతూ ఉండాలి. ఇందులో 4 చెంచాలు నెయ్యి వేసి బాగా కలపాలి.. ఇప్పుడు ఒక ప్లేట్ కి వెన్న రాసుకొని ముందుగా సిద్ధం చేసుకున్న ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి వేసుకొవాలి.. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తరువాత మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకుంటే ఈ హెల్తీ స్వీట్ తినడానికి రెడీ..
ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…